BigTV English

CM Jagan: ‘పగలు బీజేపీతో.. రాత్రి కాంగ్రెస్‌తో చంద్రబాబు సంసారం’

CM Jagan: ‘పగలు బీజేపీతో.. రాత్రి కాంగ్రెస్‌తో చంద్రబాబు సంసారం’

CM Jagan: పగలు బీజేపీతో.. రాత్రి కాంగ్రెస్ తో చంద్రబాబు సంసారం చేస్తున్నారని సీఎం జగన్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మనిషేనని జగన్ ఆరోపించారు.


టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు హేయమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఏపీలో పోటీ చేస్తోందని విమర్శించారు.

వైసీపీ ఓట్లను చీల్చి, తమను ఓడించి చంద్రబాబును గెలిపించడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతుందని చెల్లెలు వైఎస్ షర్మిలను ఉద్దేశించి జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మనిషేనని ఆరోపించారు.


వైఎస్సార్ ఎవరితోనైతే యుద్ధం చేశారో.. వారితోనే వైఎస్సార్ వారసులమని చెప్పుకునే వారు చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన కళ్లను మనమే పొడుచుకున్నట్లు అవుతుందని జగన్ మండిపడ్డారు.

దేశంలో నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసిన మోదీ ప్రభుత్వంతో చంద్రబాబు జతకట్టారని ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లు కోసం చంద్రబాబు మోదీతో మాట్లాడగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు పగలు బీజేపీతో.. రాత్రి కాంగ్రెస్ తో సంసారం చేస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు.

Related News

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

AP Cabinet: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్.. ఒకటి కాదు సుమా.. అవేమిటంటే?

Big Stories

×