
Vijayakanth latest news(Cinema News in Telugu):
కోలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ నటుడు ఒకప్పటి స్టార్ హీరో విజయ్ కాంత్. తెలుగు డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ లో కూడా ఇతడు సుపరిచితమైన హీరో. ఇప్పటివరకు తెలియకపోవచ్చు.. 1990 ప్రాంతంలో ఎన్నో యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను ఫుల్ స్వింగ్ లో ఎంటర్టైన్ చేశాడు ఈ హీరో. అందుకే ఇతని గురించి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా ప్రత్యేకమైనటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆ తర్వాత తన సినీ గ్లామర్ కి పొలిటికల్ ఇమేజ్ ని యాడ్ చేసి నాయకుడిగా ఎదిగాడు ఈ సెలబ్రిటీ.
తన సినిమాల ద్వారా లక్షల మంది అభిమానాన్ని సంపాదించడంతో పాటు ..తన నటనతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో పాత్రలకు ప్రాణం పోశాడు. ఒక సమయంలో అతనికి చిత్రాలకు భారీగా క్రేజ్ ఉండేది. తర్వాత కొంతకాలానికి సినీ ఇండస్ట్రీ ని వదిలి ప్రజల కోసం డీఎండీకే పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేశారు. ప్రస్తుతం 70 సంవత్సరాల వయసు ఉన్న విజయ్ కాంత్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
గత కొద్ది కాలంగా అప్పుడప్పుడు విజయకాంత్ ఆరోగ్యం బాగా దెబ్బతినడం.. ఆ తర్వాత కొన్ని రోజులకు కోల్పోవడం.. ఇదే పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు తీవ్ర అస్వస్థతకు గురి అయిన విజయ్ కాంత్ మరొకసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఇది అభిమానుల్లో తీవ్రమైన ఆందోళన రేకెత్తుతోంది. జలుబు ,గొంతు నొప్పి, దగ్గు , జ్వరం వంటి సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న విజయ్ కాంత్ హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అతనిని ఇంకా ఒకరోజు అబ్జర్వేషన్ లో ఉంచాల్సినట్టు డాక్టర్లు పేర్కొన్నారు.
టెస్ట్ రిపోర్ట్స్ చెక్ చేసిన తర్వాత విజయ్ కాంత్ రేపు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే డయాబెటిస్తో బాధపడుతున్న విజయ్ కాంత్ కు కాలికి ఉన్న మూడు వేళ్ళని డాక్టర్లు తొలగించారు. గత కొద్ది కాలంగా ఎక్కడికి వెళ్లినా ఈయన వీరు చేయరు సహాయంతోనే వెళుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని మయాత్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు.. పలువురు తమిళ్ సినీ సెలబ్రిటీలు.. విజయ్ కాంత్ త్వరలోనే పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.