
Mansoor Ali Khan about Trisha(Celebrity news today) :
నిన్నటి నుంచి సోషల్ మీడియాలో త్రిష గురించి సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మన్సూర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మంది పడ్డారు. అతను మాట్లాడిన మాటలు కేవలం త్రిషనే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఆడవారి అందర్నీ అవమానించినట్టే అని కొందరు భావిస్తున్నారు.ఈ నేపధ్యంలో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న మన్సూర్ సడన్ గా తాను చేసిన వ్యాఖ్యల గురించి వివరణ ఓ పెద్ద లేక ద్వారా తెలిపాడు.
లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ లేదు .. ఇంతకుముందు చాలా సినిమాల్లో నేను ఇలాంటి సీన్స్ ఎన్నో చేశాను.. అంటూ అతను చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోకి స్పందిస్తూ త్రిష ఇంకా ఎప్పుడు అలాంటి నటుడుతో నటించకుండా జాగ్రత్త తీసుకుంటాను అని అంది.త్రిష, లోకేష్ కనగరాజు, మాళవిక, చిన్మయి శ్రీపాద ఇలా చాలామంది సోషల్ మీడియా వేదికగా మన్సూర్ పై తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా తనపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ మన్సూర్ ఆలీ ఖాన్ తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ గా మారింది. ఇంతకీ అతను ఏమి రాశాడంటే..’త్రిష గురించి నేను తప్పుగా మాట్లాడాను అంటూ వస్తున్న వార్తలు నిజం కాదు. ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అయింది అన్న విషయం నా పిల్లలు నా దృష్టికి తీసుకువచ్చే వరకు నాకు తెలియదు. నిజంగా నేను ఆ వీడియోలో త్రిషని పొగిడాను. రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎలా అయితే ఒంటి చేత్తో మోసాడో ..లియో సినిమా భారాన్ని త్రిష కూడా అదే రకంగా తన భుజస్కందాలపై ఎత్తుకుంది అని నేను సరదాగా కామెంట్ చేశాను. దాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలా ఎడిట్ చేసి వీడియో రిలీజ్ చేశారు. నిజానికి త్రిషపై నేను వీడియోలో అన్నట్లుగా చూపిస్తున్న చాలా వ్యాఖ్యలు నిజానికి నేను అన్నవి కాదు. నేను అలాంటి వ్యక్తిని కాదు. నేను మహిళలను ఎంతో గౌరవిస్తాను.. నాకు పెళ్లి చేయాల్సిన ఇద్దరు కూతుర్లు ఉన్నారు అలాంటిది నేను ఆడవారి గురించి తప్పుగా ఎలా మాట్లాడుతాను. నేను త్రిష గురించి అవమానకరంగా మాట్లాడాలని కొందరు నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అందరికీ నేను చెప్పదలుచుకున్నది నేను అన్న మాటలు అవి కావు.. ‘ అని మన్సూర్ అలీ ఖాన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.