టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు ఆమని (Aamani). సాంప్రదాయమైన పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఆమనికి కూడా క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు తప్ప లేదట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ముఖ్యంగా తాను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక స్టేటస్ ను అందుకున్నప్పుడు కూడా ఎవరు తనతో అసభ్యకరంగా ప్రవర్తించలేదని, కానీ కోలీవుడ్లో ఒక సినిమా కంపెనీ వారు మాత్రం తన తల్లి, సోదరుడి ముందు తనతో అసభ్యకరంగా ప్రవర్తించి, ఇబ్బంది పెట్టారు అంటూ తెలిపింది.
తల్లి, సోదరుడు ముందే అసభ్యకరంగా ప్రవర్తించారు..
ఇక ఈ విషయంపై ఆమని మాట్లాడుతూ.. “పెద్ద ప్రొడక్షన్స్ సినిమాలలో నటీనటులతో.. దర్శక నిర్మాతలు, హీరోలు చాలా బాగా ఉంటారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కేవలం సినిమాకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడుగుతారు. ఒక డైలాగ్ ఇస్తాము చెప్పు అంటారు. ఒక డాన్స్ చేసి చూపించమంటారు ఒక ఎమోషనల్ సీన్ చేసేటప్పుడు ముఖ కవళికలు మాత్రమే గమనిస్తారు. అయితే చిన్న సినిమాల విషయంలోనే ఈ వేధింపులు ఎక్కువగా ఉంటాయి. అలా ఒక కొత్త కంపెనీ సినిమాలో అవకాశం ఉందని పిలిస్తే నేను. నా తల్లి, సోదరుడితో కలిసి వెళ్లాను. అయితే వారు టూ పీస్ డ్రెస్ వేసుకోవాలి. స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కదా.. అవి ఉన్నాయా? ఒకసారి బట్టలిప్పి చూపించండి అని, వారి ముందే అసభ్యకరంగా అడిగారు. ఇక ఆ సమయంలో నేను ఏం చేయాలో.. వారికి ఏం చెప్పాలో.. అర్థం కాలేదు. చివరికి ఆ కంపెనీ వ్యక్తి మాట్లాడుతూ.. మీకులాగే ఒక అమ్మాయిని ఫైనల్ చేశాము. కానీ స్పాట్ కి వెళ్ళిన తర్వాత ఆమెకు మచ్చ ఉంది. అందుకే ఆమెను తీసేసాము. మీరు కూడా బట్టలు విప్పితే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో లేదో చూస్తామంటూ.. అసభ్యకరంగా మాట్లాడారు. అసలు ఎలా చూపిస్తామండి.. బాడీలో చెప్పుకోలేని చోట్ల కూడా చూపించాలని ఇబ్బంది పెడతారు అంటూ ఇండస్ట్రీలో జరిగే క్యాస్టింగ్ ఇబ్బందులపై ఓపెన్ అయింది ఆమని.
మంచి, చెడు అనేవి రెండు ఉంటాయి..
ఇక ఏ రంగంలో అయినా సరే మంచి ,చెడు అనేవి రెండు ఉంటాయి. వీటిని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చెడు అని తెలిసినప్పుడు.. ఎవరైనా ఎందుకు వెళ్తారు..? అందుకే జీవితంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఒక్కసారి లొంగితే మాత్రం అది ఒక్కరితో ఆగదు.. నా జీవితంలో అలాంటి రోజు రానందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అంటూ ఆమెని తెలిపింది.
క్యాస్టింగ్ కౌచ్ సావిత్రి కాలం నుంచే వుంది..
ఇకపోతే హీరోయిన్స్ ఎదుర్కొంటున్న ఈ కాస్టింగ్ వచ్చే సమస్యలు సావిత్రి కాలం నుంచే ఉన్నాయని, కానీ అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి బయటకి ఎక్కువగా తెలిసేది కాదు. ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. కాబట్టి ఏ చిన్న విషయం జరిగినా సరే క్షణాల్లో వైరల్ అవుతుంది..అంటూ అసలు విషయాన్ని తెలిపింది ఆమని. మొత్తానికి అయితే ఇండస్ట్రీలో ఆడవాళ్లు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ చెప్పి హాట్ బాంబ్ పేల్చింది.