Actress Divi:బిగ్ బాస్(Bigg Boss) .. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ప్రసారమవుతున్న రియాలిటీ షో.. ఇక తెలుగులో బిగ్ బాస్ షోను నాగార్జున (Nagarjuna)చాలా విజయవంతంగా ప్రతి సీజన్ ను నడిపిస్తున్నారు. అలాంటి బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే 8 సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 3 మొదలు ఇప్పటివరకూ హోస్ట్ గా పనిచేస్తూ వస్తున్నారు. ప్రతి సీజన్లో ఏదో ఒక కొత్త టాస్క్ తో బిగ్ బాస్ మన ముందుకు రావడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి బిగ్ బాస్ షో కి వెళ్లి వచ్చిన తర్వాత చాలామంది నటీనటులు అక్కడ జరిగిన విషయాల గురించి డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు. ఆ విధంగానే బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చినటువంటి ప్రముఖ యాక్టర్ దివి వాధ్య (Divi Vadthya) కూడా ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో గురించి ఒక విషయాన్ని బయట పెట్టింది. తాను బిగ్ బాస్ లోకి ఎలా ఎంట్రీ అయిందో కూడా చెప్పింది. కరోనా వచ్చిన తర్వాత లాక్ డౌన్ సమయంలో బిగ్ బాస్ సీజన్ 4 జరిగింది. ఈ సందర్భంగా దివి బిగ్ బాస్ లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో తెలియజేసింది.
నాగార్జున హోస్టుగా ఉండుంటే.. ఇంకొన్ని రోజులు హౌస్ లో ఉండేదాన్ని..
బిగ్ బాస్ కి ముందు దివి వాధ్యను 4 ఇంటర్వ్యూలు చేశారట. ప్రతి ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యాను. కానీ బిగ్ బాస్ కి వెళ్లడం అప్పటికి నాకు ఇష్టం లేదు. కానీ సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం జరిగింది. అలా వద్దనుకుంటూనే బిగ్ బాస్ లోకి వెళ్లి మంచి పర్ఫామెన్స్ ఇచ్చి దాదాపు 50 రోజులు అక్కడే ఉన్నాను. ప్రతి వారం నాగార్జున (Nagarjuna) నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చేవారు. దానివల్ల నేను అన్ని వారాలు ఉండగలిగాను. నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం.కానీ బిగ్ బాస్ హౌస్ లో అందరూ కెమెరాల ముందు యాక్టింగ్ చేస్తూ ఏదో చేసినట్టు ఫీల్ అవుతారు. కానీ నేను మాత్రం జెన్యూన్ గా ఉన్నాను. నేను ఎలిమినేట్ అయ్యే వారంలో నాగార్జున హోస్ట్ గా వచ్చి ఉంటే మాత్రం నేను హౌస్ లో ఇంకా కొన్ని రోజులు కొనసాగే దాన్ని.
సమంత వల్లే ఎలిమినేట్ అయ్యా..
కానీ సమంత (Samantha) హోస్ట్ గా రావడంతో నాలో కాన్ఫిడెన్స్ మిస్సయింది. దానివల్ల హౌస్ నుంచి బయటకు వచ్చేసాను. ఆరోజు నాగార్జున వచ్చి ఉంటే ఎలిమినేట్ అయ్యేదాన్ని కాదు.. కానీ సమంత రావడం వల్లే ఎలిమినేట్ అయ్యాను అంటూ పరోక్షంగా తన ఎలిమినేషన్ ని సమంత మీదకి నెట్టేసింది దివి వాధ్య(Divi Vadthya).. ప్రస్తుతం దివి వాధ్య మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక బిగ్ బాస్ వెళ్లి వచ్చాక దివి వాధ్య కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది.అలా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశాలు అందుకుంటుంది.ఇక రీసెంట్ గా దివి వాధ్య పుష్ప-2 లో జర్నలిస్టు పాత్రలో కనిపించింది. అలాగే బాలకృష్ణ (Balakrishna) డాకు మహారాజ్ (Daaku Maharaj) మూవీ లో కూడా దివి వాధ్య నటించింది. అలా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దివి ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది.