Divi Vadthya: ఇటీవల సింగర్ మంగ్లీ(Mangli) పుట్టినరోజు(Birthday) సందర్భంగా ఘనంగా పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు అయితే ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా డ్రగ్స్ వినియోగించారని, విదేశీ మద్యం కూడా ఉపయోగించారని పోలీసులకు సమాచారం వెళ్లడంతో అర్ధరాత్రి రిసార్ట్ పై దాడి చేసి మంగ్లీ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది కూడా పాల్గొన్నారు. ఇక ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా బిగ్ బాస్ దివి(Divi) కూడా పాల్గొన్నారు. పోలీసులు రైడ్ చేసిన సమయంలో ఈమె ఏకంగా బాత్రూంలో దాక్కొని ఉన్నటువంటి ఫోటోలు బయటకు రావడంతో ఈ ఫోటోలపై దివి క్లారిటీ ఇచ్చారు.
కెరియర్ పై ఎఫెక్ట్..
ఈ విషయం గురించి ఈమె ఒక ఆడియో క్లిప్ విడుదల చేస్తూ నేను తన పుట్టిన రోజుకు పిలవడంతో ఫ్రెండ్ గా అక్కడికి వెళ్లాను కాని అక్కడ జరిగిన తప్పుకు నన్ను బాధితురాలును చేయడం సరైనది కాదని, ఇలా నా ఫోటోలను బయటకు విడుదల చేయడం వల్ల నా కెరియర్ పై పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. దయచేసి ఎవరూ ఇలా చేయొద్దు అంటూ ఈమె ఒక ఆడియో క్లిప్ బయట పెట్టారు. అయితే తాజాగా ఒక మీడియా ఛానల్ కు ఫోన్ కాల్ ద్వారా లైవ్ లో ఈమె జరిగినది మొత్తం తెలియజేశారు. ఇక ఈ వీడియోలో భాగంగా యాంకర్ తనని ఫోన్లో ప్రశ్నిస్తూ అసలు మీరెందుకు బాత్రూంలో వెళ్లి దాక్కున్నారు? పోలీసులు పిలుస్తున్న ఎందుకు అలా వెళ్ళిపోయారు అంటూ వరుస ప్రశ్నలు వేశారు.
బాత్రూంలోకి వెళ్లటమే తప్పు అయింది..
ఈ ప్రశ్నలకు దివి సమాధానం చెబుతూ… మంగ్లీ పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేశారు. అక్కడ అందరూ కలిపి కూడా ఒక 20 మంది వరకు కూడా లేరు. ఈ ఫంక్షన్ కి నిజానికి మా అమ్మ మా బ్రదర్ కూడా రావాలి చివరి నిమిషంలో మా అన్నయ్య డ్రాప్ కావడంతో అమ్మ కూడా రాలేకపోయింది. నేను కూడా 11 గంటల సమయంలో అక్కడికి వెళ్లానని దివి తెలిపారు.. ఇలా కాసేపు అక్కడ సెలబ్రేషన్స్ లో ఉండగానే పోలీసులు రావడంతో ఒక్కసారిగా గందరగోళం వాతావరణం ఏర్పడింది. పోలీసుల వీడియో తీసుకుంటూ రావడంతో నన్ను దాకోమని చెప్పారు. ఆ క్షణం ఏం జరుగుతుందో నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాక బాత్రూంలో వెళ్లి దాక్కున్నాను. బయట నుంచి ఒక మహిళ ఎస్సై డోర్ కొడుతూనే ఉన్నారు.
నిజాలు తెలియకుండా…
బయటకు వచ్చిన తర్వాత ఆమె ఆగమని చెప్తున్నారు. ఆ టైంలో వాళ్లతో నేను ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి అని దివి తెలిపారు. నిజానికి అక్కడ అందరూ అనుకున్నట్టు ఏమీ లేదు అదొక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ లాగే పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిగాయని, కానీ మీడియా వాళ్ళు నిజానిజాలు తెలియకుండా హైలెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నేను బాత్రూంలో దాక్కోవడమే తప్పయింది. ఆ ఫోటోలోనే హైలెట్ చేసి చూపిస్తున్నారని, ఇలా చేయటం వల్ల నా కెరియర్ పై ఎంత దెబ్బ పడుతుందో ఒకసారి ఆలోచించండి అంటూ ఈమె తెలిపారు. ఇప్పుడిప్పుడే నేను ఇండస్ట్రీలో కాస్త నిల తొక్కుకున్నాను. ఇలాంటి తరుణంలోనే నా గురించి ఇలాంటి వీడియో వైరల్ చేయడం బాదేసింది ఈ విషయం తెలిసి మా అమ్మ ఏడ్చిందని దివి తెలిపారు. ఈ ఘటన జరిగిన తర్వాత మా అమ్మ వాళ్లు అక్కడికి రాకపోవడమే మంచిది అయ్యింది. లేకపోతే వారికి కూడా చెడ్డ పేరు వచ్చేది మీడియా వాళ్ళు దయచేసి నిజానిజాలు తెలుసుకొని వార్తలు వేయాలని ఈ సందర్భంగా దీవి మరోసారి తన తప్పులేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.