Plane Crash: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, 20 మంది మెడికల్ కాలేజీ డాక్టర్లు మృతిచెందారు. ప్రమాదం జరిగిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో ఇద్దరు ఫైలట్లు, పది మంది విమాన సిబ్బంది, 230 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు, ఏడుగురు పోర్చుగీస్ దేశీయులు, ఒక కెనడయన్ ఉన్నారని అధికారులు తెలిపారు. అలాగే మృతుల్లో ఇద్దరు శిశువులు, సహా 13 మంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ సీఎం విజయ్ విజయ్ రూపానీ కూడా మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. మొత్తం విమానంలో ఉన్న 242 మందిలో విశ్వాస్ రమేష్ కుమార్ అనే ఒకేఒక్క యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
అయితే మృతుల కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. కనీసం చనిపోయిన వారిని గుర్తు పట్టేందుకు ఆనవాళ్లు లేకుండా పోయింది. శరీర భాగాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. చనిపోయిన వారిలో రాజస్థాన్ రాష్ట్రం బాంసువాడకు చెందిన డాక్టర్ కోమీ వ్యాస్ ఉన్నారు. ఆమె ఉదయ్ పూర్ లో జాబ్ వదిలేసి భర్తతో లండన్ లో సెటిల్ అయ్యేందుకు తన కుటుంబంతో బయల్దేరింది. ఆ కుటుంబం నుంచి ఐదుగురు సభ్యులు లండన్ కు బయల్దేరారు. అయితే వారే లండన్ కు బయల్దేరే ముందు ఒక సెల్ఫీ ఫోటో తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వారికి అదే ఆఖరి సెల్ఫీగా మిగిలిపోయింది.
ALSO READ: Ahmedabad Plane Crash : మిరాకిల్.. విమాన ప్రమాదంలో బతికిన ఒకేఒక్కడు.. వీడియో వైరల్
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి.. ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడిన. విమానంలో 11-A సీటులో కూర్చున్న విశ్వాస్ రమేశ్ కుమార్ అనే వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలతో ఉన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత అతను నడచుకుంటూ వచ్చాడు. విమానం టేకాఫ్ అయిన 30 సెకన్ల తర్వాత పెద్ద శబ్దం వచ్చిందని.. ఆ తర్వాత విమానం కూలిపోయిందని విశ్వాస్ చెప్పాడు.