Mangli Birthday Party Case : టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ మంగ్లీ(Mangli)పై కేసు నమోదు అయిన విషయం మనకు తెలిసిందే. టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న తరుణంలో ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మంగ్లీ పుట్టినరోజు (Birthday)సందర్భంగా తన స్నేహితులతో కలిసి ఈమె పెద్ద ఎత్తున పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఈ పార్టీలో డ్రగ్స్ (Drugs)ఉపయోగించినట్లు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు వెంటనే వీరు పుట్టినరోజు జరుపుకుంటున్న రిసార్ట్ పై దాడి చేశారని తెలుస్తుంది. ఇక ఈ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు కూడా చేయించారు.
నన్ను బాధితురాలిని చేయొద్దు..
ఇక ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా పలువురు స్నేహితులు పాల్గొన్నారు. ఇక ఈ పుట్టినరోజు వేడుకలలో బిగ్ బాస్ ఫేమ్ దివి వైద్య(Divi Vadthya) పాల్గొన్నారని వార్తలు బయటకు వచ్చాక ఈమె ఫోటోలతో కొన్ని వీడియోలు కూడా బయటకు రావడంతో ఈ విషయంపై దివి స్పందించారు. ఈ సందర్భంగా ఈమె ఒక ఆడియో క్లిప్ విడుదల చేయడంతో ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా దివి మాట్లాడుతూ…”మీడియా మిత్రులందరికీ నమస్కారం.. ఇప్పుడు ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అని పిలిస్తే అక్కడ ఎలాంటి తప్పు జరిగినా దానికి మనం కారణమని, మనపై ఆ తప్పును తోసేయడం సరైనది కాదని తెలిపారు.
నా కెరియర్ కు ఇబ్బంది..
నిజానిజాలు తెలియకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా నన్ను ఇన్వాల్వ్ చేస్తున్న ఫోటోలు వేయడం సరైనది కాదని తెలిపారు. మీరు కూడా ఆ విషయాలన్నింటినీ గమనించాలని, అందులో నేను ఏమైనా తప్పు చేశానని అనిపిస్తే నా ఫోటో వేస్తే బాగుంటుంది కానీ, ఇలా అనవసరంగా నా ఫోటోలు వేయడం వల్ల నా కెరియర్ కు ఇబ్బంది అవుతుందని తెలిపారు. నేను ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చానని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. మీరు కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్ పార్టీలకు పిలిస్తే ఖచ్చితంగా వెళ్తారు, అలాగే నేను కూడా తను పిలవడం వల్లే వెళ్లానని దివి తెలిపారు.
ఇలా తన పిలవడం వల్లే నేను వెళ్లాను.. వెళ్లిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలకు నన్ను బాధితురాలిని చేయడం సరైనది కాదని, ఈ విషయంలో దయచేసి నా ఫోటోలను బయట పెడుతూ నన్ను ఇబ్బందులకు గురి చేయొద్దు అంటూ దివి ఈ సందర్భంగా విడుదల చేసిన ఒక ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో పై నెటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. అయితే ఈ పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం వాడారని,అలాగే డ్రగ్స్ కూడా వాడినట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. అలాగే కొంతమందికి డ్రగ్స్ పరీక్షలలో పాజిటివ్ అని రావడంతో పోలీసులు మంగ్లీ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిగితేనే అసలు నిజాలు బయటకు తెలియనున్నాయి.