Mangli Drugs Case: సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం సర్దుమణుగుతోంది అనుకునే లోపే.. మళ్ళీ మరో వ్యవహారం తెరపైకి వచ్చి, అందరిని ఉలిక్కిపడేలా చేసింది. ప్రముఖ ఫోక్ సింగర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సింగర్ మంగ్లీ (Singer Mangli) పుట్టినరోజు నిన్న కావడంతో ఆమె పలువురు సన్నిహితులకు, సెలబ్రిటీలకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. ఈ పార్టీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. చేవెళ్లలోని త్రిపురా రిసార్ట్ లో మంగళవారం రాత్రి జరిగిన మంగ్లీ బర్తడే వేడుకల్లో భారీగా విదేశీ మద్యం, గంజాయి ఉపయోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో.. వెంటనే రైడ్ నిర్వహించిన పోలీసులు విదేశీ మద్యం, గంజాయి స్వాధీనం చేసుకొని పలువురి పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇకపోతే పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పార్టీలో ఏం జరిగిందంటే?
ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. “అర్థరాత్రి ఒంటి గంట సమయంలో రిసార్ట్ పైనే ఫిర్యాదు వచ్చింది. రిసార్ట్ లో పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ హంగామా చేస్తున్నారని, పెద్ద ఎత్తున డీజే పెట్టారని, కంట్రోల్ రూమ్ కి స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మహిళా ఎస్సై త్రిపుర రిసార్ట్ కి వెళ్ళగా.. అక్కడ పది మంది మహిళలు, 12 మంది పురుషులు కలిసి డీజే పెట్టి హంగామా చేస్తున్నట్లు గుర్తించారు. అయితే వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో ఉండి డాన్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారట. అయితే ఇక్కడ మంగ్లీ బర్తడే పార్టీ జరుగుతున్నట్లు రిసార్ట్ మేనేజర్ తమతో తెలిపారని, అయితే ఆ పార్టీకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని మేనేజర్ తెలిపారు.
ఇక పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇకపోతే పార్టీలో పాల్గొన్న వారందరికీ డ్రగ్ టెస్టు నిర్వహించగా.. అందులో మంగ్లీ అనుచరుడుగా ఉన్న దామోదర్ రెడ్డి గంజాయి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే మంగ్లీ సోదరుడు శివరామకృష్ణ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటు ఈవెంట్ ఆర్గనైజర్ మేఘరాజు పై కూడా కేసు నమోదు చేశారు.
మంగ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సెలబ్రిటీస్..
ఇకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో అంశం ఏమిటంటే.. ఇందులో పలువురు సెలబ్రిటీలు కూడా ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మంగ్లీ ఇన్వైట్ చేసిన వారిలో ప్రముఖ సెలెబ్రిటీస్ కాసర్ల శ్యామ్ (Kasarla syam)తో పాటు దివి(Divi ) కూడా పార్టీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక వారితోపాటు మంగ్లీపై కూడా కేసు నమోదు అయినట్లు సమాచారం.
అయితే ఇక్కడ వీరు కూడా గంజాయి తీసుకున్నారా? లేదా ? అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ తాజాగా దీనిపై స్పందించిన దివి..”పార్టీకి వెళ్లాను కానీ అక్కడ నేను ఎటువంటి తప్పు చేయలేదు” అంటూ ఒక ఆడియో రిలీజ్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ: Pawan Kalyan: ‘ఉస్తాద్’ సెట్ లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో!