Indian railway Update: సౌత్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. తన పరిధిలోని పలు రూట్లలో మెయింటెనెన్స్ పనుల కారణంగా పలు సర్వీసులను టెంపరరీగా క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపింది. కాచిగూడ, నిజమాబాద్, మెదక్, మిర్యాలగూడ రూట్లలో ఈ పనులు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ పనులు జూన్ 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు కొనసాగనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. నిర్వహణ పనుల కారణంగా, దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దు చేసిన రైళ్లు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
పాక్షికంగా రద్దు అయిన రైళ్ల వివరాలు
⦿ జూన్ 12 నుంచి సెప్టెంబర్ 12 మధ్య నడుస్తున్న కాచిగూడ – నిజామాబాద్ (77601), నిజామాబాద్ – కాచిగూడ (77602) రైళ్లను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: ప్రపంచంలో ఫాస్టెస్ట్ రైళ్లు ఇవే, ఒక్కోదాని వేగం చూస్తే కళ్లు తిరగాల్సిందే!
⦿ అదే సమయంలో కాచిగూడ – మెదక్ (77603), కాచిగూడ – మిర్యాలగూడ (67775), మిర్యాలగూడ – కాచిగూడ (67776) రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు.
ఈ మార్గాల్లో ప్రయాణించే రైల్వే ప్రయాణీకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు. ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకే ఈ మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రయాణీకులు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.
Read Also: తెలంగాణలో మరో రెండు ఎయిర్ పోర్టులు, అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?