Allari Naresh Movie ‘Aa Okkati Adakku’ Final Review: తన అల్లరితో ఎదుటివారిని విపరీతంగా అలరించేస్తాడు నటుడు అల్లరి నరేష్. ఈ హీరో నటించిన కొత్త సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఇందులో నరేష్ సరసన హీరోయిన్‌గా టాల్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా నటించింది. ఈ మూవీ ఈ రోజు (మే 3)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి గత మూవీల కంటే ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
గణపతి (అల్లరి నరేష్) సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉద్యోగం చేస్తుంటాడు. అయితే తనకు ఓ తమ్ముడు (విరూపాక్ష ఫేం రవికృష్ణ) ఉంటాడు. అయితే రవికృష్ణకి, మేనమామ కూతురు దేవి (జేమీ లివర్)కి పెళ్లి చేస్తాడు. ఇక గణపతి వయసు ఎక్కువగా ఉండటంతో అతడికి పిళ్లని ఇవ్వడానికి ఏ అమ్మాయి తల్లిదండ్రులు ముందుకు రారు. అదీగాక తన కంటే ముందే తన తమ్ముడికి పెళ్లి చేయడంతో కూడా చాలామంది అతడిని రిజెక్ట్ చేస్తారు. మొత్తం హాఫ్ సెంచరీ వరకు పెళ్లి చూపులు కంప్లీట్ చేస్తాడు.
ఇక దీనివల్ల కాదని.. మ్యాట్రీమోనీ సైట్ ద్వారా ఓ పిల్లని పడతాడు. ఆమె సిద్ధి (ఫరియా అబ్దుల్లా). అయితే ఆమె మాత్రం నేను మీకు కరెక్ట్ కాదని రిజెక్ట్ చేస్తుంది. దీంతో వారు ఫ్రెండ్స్‌గా మారుతారు. అయితే ఓ రోజు మ్యాట్రీమోనీ ద్వారా అబ్బాయిలను మోసం చేసి డబ్బులు దోచే ఖిలాడీ లేడీ సిద్ధి అని వార్తల్లో వస్తుంది. దీంతో అలా ఎందుకు వచ్చింది. పెళ్లికానీ యువకులు ఏ విధంగా మోసపోయారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read: సర్లే.. నరేష్ అన్నా.. నీ కామెడీ కోసం ఆ మాత్రం ఆగలేమా.. ?
విశ్లేషణ:
‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్ అయితే క్లాసిక్‌గానే ఉంది. అయితే ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌ట్రైనర్ అయితే కాదు!. ఈ మూవీ టైటిల్‌తో కామెడీ కోటింగ్ ఇచ్చి సీరియస్ సినిమా తెరకెక్కించారు. అయితే ప్రస్తుతం చాలా మంది యువతి, యువకులు పెళ్లి సంబంధం కోసం మ్యాట్రీమోనీ సైట్లను ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో మ్యాట్రీమోనీ సైట్లు అమ్మాయిల నంబర్లను, అబ్బాయిలకు ఇవ్వడం ద్వారా మ్యాట్రీమోనీ సైట్లలో యువతి, యువకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయనేది ఇందులో చూపించారు.
ఇందులో పెళ్లికాని యువకుడిగా నరేష్, మరదలిగా జెమీ లివర్ సన్నివేశాలు సరదా సరదాగా ప్రేక్షకుల్ని బాగా అలరిస్తాయి. అలాగే వెన్నెల కిషోర్ కామెడీ మరింతగా నవ్విస్తుంది. ఆ తర్వాత సీరియస్ ఇష్యూ స్టార్ట్ కావడంతో.. కామెడీ తగ్గింది. దీంతో సినిమా కాస్త సాగదీసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.
Also Read: సెన్సార్ పూర్తి చేసుకున్న ఆ ఒక్కటి అడక్కు.. రిలీజ్ కు రెడీ!
అంతేకాకుండా తమ్ముడుకి ముందుగా పెళ్లిచేసిన అల్లరి నరేష్.. తాను ఇంకా ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు అని హీరోయిన్ అడిగిన ప్రశ్నకు చూపించిన ఫ్లాష్ బ్యాక్ పెద్దగా ఆకట్టుకోలేదు. పెళ్లి కొడుకు మోసాలను.. తరచూ వార్తల్లో చూసే విషయాలను ఇందుటో టచ్ చేశారు.
గోపీసుందర్ పాటల్లో ఆర్ఆర్ బాగుంది. అంతేకాకుండా పిక్చరైజేషన్ కూడా ఆకట్టుకుంటుంది. మిగతవేవి అంతగా ఆకట్టుకోలేదు. ఇక గణపతి పాత్రలో అల్లరి నరేష్ బాగా యాక్ట్ చేశాడు. అయితే అతడికి తగ్గట్టుగా పంచ్ డైలాగులు, కామెడీ సీన్లు పడలేదు. ఫరియా యాక్టింగ్ ఓకే. మిగతా నటీ నటుల యాక్టింగ్ కూడా పర్వాలేదనిపించింది. ఇక సినిమా మొత్తం కామెడీ ఉంటుందంటే కష్టమే అని చెప్పాలి. మొత్తంగా ఒక్కసారి అయితే ఈ సినిమాను థియేటర్లలో చూడొచ్చు.