BigTV English
Advertisement

Hebah Patel: ప్రేమ పెళ్లి పై అలాంటి కామెంట్స్ చేసిన హెబ్బా పటేల్..!

Hebah Patel: ప్రేమ పెళ్లి పై అలాంటి కామెంట్స్ చేసిన హెబ్బా పటేల్..!

Hebah Patel: ‘కుమారి 21ఎఫ్’ లో చిట్టి పొట్టి బట్టలతో ఒక్కసారిగా అందర్నీ మెస్మరైజ్ చేసిన అందాల తార హెబ్బా పటేల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వరుస హిట్స్ అందుకొని అందరి మనసు దోచుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోషూట్స్ తో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే మధ్యలో స్పెషల్ సాంగ్స్ చేసిన ఈమె ఆ తర్వాత ఫ్లాప్స్ కూడా చవి చూసింది. ఇక ఇటీవల మళ్ళీ బిజీ అయిపోయింది. చేతన్ కృష్ణ హీరోగా, హెబ్బా పటేల్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ‘ధూం ధాం’. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎమ్మెస్ రామ్ కుమార్ నిర్మాణంలో సాయి కిషోర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సాయికుమార్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ తదితరులు కీలకపాత్రలు పోషించారు.


ఈ సినిమాకి స్టార్ రైటర్ గోపి మోహన్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించగా నవంబర్ 8వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్స్ కార్యక్రమాలు వేగంగా చేపట్టారు. ప్రమోషన్స్ లో భాగంగా తన పెళ్లి, రిలేషన్స్ గురించి మాట్లాడుతూ.. అందరిని సంతోషపరిచింది హెబ్బా పటేల్. హెబ్బా పటేల్ మాట్లాడుతూ..”గతంలో నేను పెళ్లి చేసుకోను అని చెప్పాను. అయితే ఇప్పటికీ అదే మాట మీద నిలబడ్డాను. ఒకవేళ పెళ్లి చేసుకుందాం అనుకున్నా.. సరైన అబ్బాయి మాత్రం నాకు దొరకట్లేదు. ఒకవేళ ఒక మంచి అబ్బాయి దొరికి అతడితో రిలేషన్ లో ఉండి, అన్ని విధాలా నాకు ఓకే అనిపిస్తే, అప్పుడు పెళ్లి గురించి మాట్లాడుతాను. ఇవన్నీ జరిగితే అప్పుడు చూద్దాం” అంటూ తెలిపింది హెబ్బా పటేల్. మరి భవిష్యత్తులో హెబ్బా పటేల్ వివాహం చేసుకుంటుందేమో చూడాలి. అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

అలాగే ఈ సినిమాలో ఆర్టిస్టుల గురించి మాట్లాడుతూ.. “ఈ సినిమాల్లో చేతన్ చాలా కామ్ గా , కూల్ గా ఉంటాడు. నేనేమో హైపర్ యా. మాలో ఎవరు జూనియర్, ఎవరు సీనియర్ అనే విషయాలను మేము పట్టించుకోలేదు. కెమెరా ముందు ఎలా పెర్ఫామ్ చేశాము అనే విషయాన్ని మాత్రమే చూసుకున్నాము. నాకు అందరితో కాంబినేషన్ సీన్స్ పడలేదు. ఒక్క సాంగ్ లో మాత్రం అందరితో కలిసి నేను కనిపిస్తాను. అయితే ముందుగా.. మీకు ఈ సినిమాలో నాకు అవకాశం ఎలా వచ్చిందో చెబుతాను. బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ ఒకరోజు ఫోన్ చేసి నాకు ఈ సినిమా గురించి చెప్పారు. కథ విన్న తర్వాత చాలా కాలం తర్వాత ఒక మంచి ఎంటర్టైన్మెంట్ పాత్ర వచ్చిందని ఆలోచించి వెంటనే ఒప్పుకున్నాను .ఇలాంటి సినిమా చేసి ఎంతో కాలం అయ్యింది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు సుహానా.. బబ్లీ గర్ల్ పాత్ర నాది. నా పాత్ర అందరికీ మెచ్చేలా ఉంటుంది” అంటూ హెబ్బా పటేల్ తెలిపింది.


Related News

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Big Stories

×