BigTV English
Advertisement

Janvi Kapoor : దెయ్యంగా మారబోతున్న జాన్వీ కపూర్..డబ్బుల కోసం ఇంత కక్కుర్తినా..?

Janvi Kapoor :  దెయ్యంగా మారబోతున్న జాన్వీ కపూర్..డబ్బుల కోసం ఇంత కక్కుర్తినా..?

Janvi Kapoor : బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ( Janvi Kapoor) గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. స్వర్గీయ నటి శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు కూడా మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇక గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ( NTR) నటించిన రీసెంట్ మూవీ దేవర ( Devara ) సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది.. జాన్వీ పాప నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక దేవర సినిమా చేస్తున్నప్పుడే మరో రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టింది. ఇప్పుడు మరో రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందట.. హాట్ బ్యూటీ అలాంటి పాత్రలో కనిపించడం ఏంటని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఆ సినిమా ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


జాన్వీ కపూర్ రీసెంట్ గా ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ మరో రెండు సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా రిలీజ్ కి ముందే ఆర్సీ 16లోనూ ఛాన్స్ అందుకుంది. ఇంకా అమ్మడు ఒకే చెప్పాలి గానీ అమ్మడితో సినిమాలు చేయడానికి దర్శక, నిర్మాతలు, హీరోలు వెయిట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే ఎక్కువ సినిమా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.. రామ్ చరణ్ కు హీరోయిన్ గా చేయబోతుంది. కానీ ఈ క్రమంలో మరో సినిమాను లైన్లో పెట్టిందని టాక్..

పాప మరో రీమేక్ సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ లో తెరకెక్కిన `ఈరం` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆది పీనిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో `వైశాలి`గా రిలీజ్ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్ ఇక్కడా మంచి విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.. ఈ సినిమా వచ్చి దాదాపు 15 ఏళ్లు పూర్తి అయ్యింది. ఇన్నాళ్లకు ఈ మూవీని రీమేక్ చేయబోతున్నారు. ఇందులో జాన్వీ కపూర్ ని మెయిన్ లీడ్ కి ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమాతో ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస దర్శకుడిగా పరిచమవుతున్నాడు.. ఈ సినిమా మొత్తం జాన్వీ క్యారక్టర్ మీదే తిరుగుతుంది.. ఇక ఈ సినిమా తర్వాత మరో సినిమాకు జాన్వీ పాప సైన్ చేసినట్లు చేస్తుంది. ఆదిపినిశెట్టి పోషించిన పాత్రలో బాలీవుడ్ నుంచి ఏ హీరో దక్కించుకుంటాడో చూడాలి. ఆది పినిశెట్టి రోల్ కంటే నంద రోల్ కూడా ఎంతో కీలకమైనది.. అలాగే ఆమె భర్త పాత్ర కూడా.. మరి ఎవరిని ఫిక్స్ చేస్తారో చూడాలి.. ఏది ఏమైనా ఈ వార్త గురించి ఇంకా కన్ఫార్మ అవ్వలేదు. కానీ నెటిజన్లు మాత్రం డబ్బుల కోసం ఇలాంటి పాత్ర చేస్తున్నావా అని కామెంట్స్ చేస్తున్నారు..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×