BigTV English

Great Dog: గ్రేట్ కుక్క.. క్షణాల్లో 63 మంది ప్రాణాలను?

Great Dog: గ్రేట్ కుక్క.. క్షణాల్లో 63 మంది ప్రాణాలను?


Great Dog: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే తాజాగా రాష్ట్రంలోని మండి జిల్లాలో జరిగిన ఓ ఘటన మానవ చరిత్రలో ఓ అద్భుతమైన ఘట్టంగా నిలుస్తోందని చెప్పవచ్చు. జిల్లాలోని సియాతి గ్రామంలో ఓ కుక్క చేసిన అలర్ట్ తో గ్రామం గ్రామమంతా ప్రాణాలతో బయటపడింది. ప్రకృతిలో ఎప్పుడు ఏం జరుగుతుందో..? ప్రకృతి వినాశనం ఎప్పుడు సంభవిస్తుందో..? జంతువులు మనుషుల కన్నా ముందే గ్రహిస్తాయని ఈ తాజా ఘటన ప్రూఫ్ చేసింది.

వారి క్రితం.. జాన్ 30 అర్థరాత్రి సమయంలో సియాతి గ్రామంలో భారీ వర్షాలకు ఓ కొండచరియ విరిగిపడింది. సరిగ్గా అదే టైంలో ఓ బిల్డింగులో రెండో అంతస్తులో ఓ శునకం ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టింది. అది ఎలా అంటే.. భయంకరంగా మొరగడం స్టార్ట్ చేసింది. దాని సౌండుకు ఇంటి యజమాని లేచి.. ఇంటిపైకి వెళ్లగా గోడలు పగలినట్టు కనిపిస్తోంది. అంతే కాదు.. ఇంట్లోకి వరదనీరు చేరింది.


కుక్క సంకేతాన్ని యజమాని సీరియస్ గా తీసుకుని మంచి పనిచేశాడు. వేగంగా కుక్కను తీసుకెళ్లి.. ఇతర స్థానికులందరినీ లేపి.. అలర్ట్ చేశాడు. గ్రామస్థులందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించాడు. అంతే.. క్షణాల్లోనే కొండచరియలు విరిగిపడ్డాయి. ఊళ్లో ఇళ్లన్నీ ధ్వంసం అయ్యాయి. దాదాపు 63 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. కుక్క అలర్ట్ తో వారు ప్రాణాలు దక్కాయి. ఈ సంఘటనతో కొన్ని ఇళ్లు మాత్రమే దెబ్బతినకుండా ఉన్నాయి. ఎక్కువ శాతం ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

ప్రస్తుతం ఆ ఊరు ప్రజలందరూ పక్క గ్రామం తియంబాలాలోని నైనా దేవీ టెంపుల్ లో ఉంటున్నారు. అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. చాలా మంది బాధితులు తమ ఆస్తులను కోల్పోయి.. తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నానా ఇబ్బందులు పడ్డారు. కొందరికి అధిక రక్తపోటు సమస్య తలెత్తింది. అయినప్పటకీ ఆ కుక్క వల్ల వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో వారు ఆ కుక్కను దేవుడిగా ప్రార్థిస్తున్నారు.

అదే జిల్లాలో తునాగ్ అనే ప్రాంతంలో ఓ కో-ఆపరేటివ్ బ్యాంక్ కూడా వరద నీటితో పూర్తిగా మునిగిపోయింది. బ్యాంకులో ఉన్న డబ్బులు, గోల్డ్, ఇతర విలువైన డాక్యుమెంట్స్ కంటికి కనబడకుండా పోయాయి. వాటిని గుర్తించేందుకు అధికారులతో పాటు గ్రామస్థులు గాలిస్తున్నారు. అయినప్పటికీ లాభం లేకపోయింది.

ALSO READ: Viral Video: ట్రైన్‌లో డేంజర్ స్టంట్ చేయబోయిన కూతురు.. పొట్టుపొట్టు కొట్టిన తల్లి.. ఇదిగో వీడియో

అయితే, సియాతి గ్రామంలో ఆ కుక్క చేసిన సంకేతంతో ఆ గ్రామ ప్రజలందరూ ప్రాణాలతో బయటపడ్డారు. జంతువులు మనకంటే ముందే ప్రమాదాలను గుర్తించగలవని ఈ కుక్కతో మరోసారి ప్రూఫ్ అయ్యింది. ఆ కుక్క చేసిన సహాయాన్ని ఆ గ్రామ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు. జీవితాంత గుర్తు పెట్టుకుంటారు.

ఒక్కసారి ఆ కుక్క అరుపు వినకపోయినా, పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. ఈ సంఘటన మనకు మరోసారి మనకు గుర్తు చేస్తోంది. ప్రకృతతో పాటు మనం జంతువుల సంకేతాలను కూడా గౌరవించాలని తెలియజేస్తుంది. ఏదేం అయినప్పటికీ పెంపుడు జంతువులను మంచిగా చూసుకుందాం.. అవి మనకు ఎప్పటికీ మంచే చేస్తాయి.

ALSO READ: Attukal Bhagavathi Temple: 5 మిలియన్ మహిళల దేవాలయం.. ఇక్కడ మగవాళ్లకి నో ఎంట్రీ!

Related News

Aadhaar download Easy: ఆధార్ కార్డు వాట్సాప్‌లో డౌన్‌లోడ్.. అదెలా సాధ్యం?

Karnataka News: విప్రో క్యాంపస్ గేటు తెరవాలన్న సీఎం.. నో చెప్పిన ప్రేమ్‌జీ, అసలేం జరిగింది?

Freebies Cobra Effect: ఉచిత పథకాలు ఎప్పటికైనా నష్టమే.. కోబ్రా ఎఫెక్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Big Stories

×