BigTV English

Actress Kalpika: గచ్చిబౌలి పబ్‌లో హీరోయిన్ కల్పికపై దాడి… అర్ధరాత్రి అసలేం జరిగిందంటే ?

Actress Kalpika: గచ్చిబౌలి పబ్‌లో హీరోయిన్ కల్పికపై దాడి… అర్ధరాత్రి అసలేం జరిగిందంటే ?

Actress Kalpika: సినీనటి కల్పిక (Kalpika) పై గచ్చిబౌలి పబ్(Pub) లో దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పబ్ నిర్వాహకులతో కల్పిక గొడవకు దిగినట్టు సమాచారం. పుట్టినరోజు వేడుకలలో భాగంగా కేక్ (Cake)విషయంలో కల్పిక పబ్ యాజమాన్యంతో గొడవకు దిగడంతో పబ్ నిర్వాహకులు కూడా ఆమెపై దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. అయితే ఈ గొడవ అనంతరం నిర్వాహకులు కానీ, నటి కల్పిక కానీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయకపోవడంతో ఈ దాడి పట్ల పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ప్రిజం పబ్ లో గొడవ…

గచ్చిబౌలిలో ఉన్నటువంటి ప్రిజం పబ్ కు కల్పిక వెళ్లి బర్తడేకు సంబంధించిన కేక్ ఆర్డర్ చేశారు. అయితే ఈ కేక్ విషయంలో ఆమె పబ్ యాజమాన్యంతో గొడవకు దిగి వారిపై బూతులతో రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. ఇక వారు కూడా ఈమెపై దురుసుగా ప్రవర్తిస్తూ తను ఒక డ్రగ్గిస్ట్ అంటూ దాడికి దిగారని సమాచారం. ఇలా ఇరువురి మధ్య చోటు చేసుకున్న ఈ గొడవ తారాస్థాయికి చేరడంతో అక్కడే ఉన్నటువంటి కొంతమంది జోక్యం చేసుకొని శాంతింప చేయటంతో ఈ గొడవ సద్దుమణిగినట్టు తెలుస్తుంది. ఇలా పబ్ యాజమాన్యంతో ఇంత పెద్ద గొడవ జరిగినప్పటికీ ఈమె మాత్రం ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకపోవడం గమనార్హం.


వివాదాలతో పాపులర్…

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న కల్పిక ఇదివరకు కూడా పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. వివాదాలలో నిలవడం ఈమెకు కొత్తేమికాదు. ఇలాంటి వివాదాల ద్వారా ఈమె వార్తల్లో నిలుస్తూ పాపులర్ అయ్యారు. గతంలో ఈమె నటుడు అభినవ్ గోమటం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అభినవ్ పురుషాహంకరి అంటూ వ్యాఖ్యలు చేయడంతో అభినవ్ కూడా కల్పిక వ్యాఖ్యలపై స్పందిస్తూ ఘాటుగా తనదైన శైలిలోని సమాధానం చెప్పారు. అంతేకాకుండా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ ఒకానొక సమయంలో వార్తలు కూడా వినిపించాయి.

ఇలా వీరిద్దరి ప్రేమ గురించి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలపై అభినవ్ స్పందిస్తూ ఇద్దరి మధ్య అలాంటి వ్యవహారాలు ఏమీ నడవలేదని క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు పూర్తిగా చెక్ పడింది. ఇలా ఒకానొక సమయంలో వీరిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఇక ప్రస్తుతం కల్పిక పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆరెంజ్, జులాయి, సారొచ్చారు వంటిపలు సినిమాలలో నటించిన కల్పిక చివరిగా సమంత లేడీ ఓరియంటెడ్ గా నటించిన యశోద సినిమాలో ఓ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×