BigTV English

Money Earning Tips: తిరుగుతూ డబ్బులు సంపాదించే ఉపాయం.. ట్రావెలింగ్‌తో లక్షల్లో ఆదాయం!

Money Earning Tips: తిరుగుతూ డబ్బులు సంపాదించే ఉపాయం.. ట్రావెలింగ్‌తో లక్షల్లో ఆదాయం!

జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ది అని పెద్దలు చెప్పినట్లు.. ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కోలా ఉంటాయి. కొంత మంది ఇంట్లో నుంచి బయటకు వెళ్లరు. మరికొంత మంది ఇంట్లో కాలు నిలడవదు. ఇలాంటి వారి కోసమే ఓ గుడ్ న్యూస్. ఎంచక్కగా ట్రావెల్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు. దేశ విదేశాల్లోని అద్భుతమైన ప్రదేశాలను, వింతలు, విశేషాలను చూడ్డంతో పాటు అందరికీ చూపిస్తూ బోలెడు డబ్బులు పోగేసుకోవచ్చు. ఒకవేళ మీకూ ట్రావెల్ చేస్తూ డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉంటే.. సింపుల్ గా ఈ టిప్స్ పాటించేయండి.


⦿ ట్రావెల్ బ్లాగ్/వ్లాగ్‌ షురూ చేయండి 

ఒకవేళ మీరు ట్రావెల్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన ఉంటే.. మీరు వెంటనే ఓ బ్లాగ్ లేదంటే బ్లాగ్ ఓపెన్ చేయండి. దేశంలోని అద్భుతమైన ప్రదేశాలు, ఫుడ్, సంస్కృతి, సంప్రదాయాల గురించి విరించాలి. ట్రావెల్ చిట్కాలను బ్లాగ్ లేదంటే సోషల్ మీడియాలో వివరించే ప్రయత్నం చేయాలి. వెళ్లిన ప్రతి ప్రదేశంలోని ఆసక్తికర విషయాలను ఒడిసిపట్టి ప్రజలకు వివరంగా చెప్పాలి.


⦿ డబ్బులు ఎలా సంపాదించాలి?

మీ బ్లాగ్స్ లో రాసే కథనాలు, యూట్యూబ్ షేర్ చేసే వీడియోలకు మంచి వ్యూస్ వచ్చినట్లు అయితే, ట్రావెల్ కంపెనీల నుంచి స్పాన్సర్లను పొందే ప్రయత్నం చేయండి. యూట్యూబ్, బ్లాగ్ లో యాడ్స్ ను డిస్ ప్లే చేయండి.  హోటళ్ళు, పర్యటనలను బుక్ చేసుకోవడానికి లింక్‌ లను షేర్ చేయండి. కమీషన్ తీసుకోండి. ఛానెల్, బ్లాక్ కు ఎక్కువ వ్యూవర్ షిప్ ఉంటే ఆటో మేటిక్ గా గూగుల్ కూడా యాడ్స్ ఇస్తుంది.

⦿ ఇండియన్ ట్రావెలర్స్ కు టిప్స్

ఇండియన్ ట్రావెలర్స్ వ్యూవర్ షిప్ పెంచుకునేందుకు అద్భుతమైన ప్రదేశాలను ఎక్స్ ప్లోర్ చేయండి. లడఖ్ పర్వతాలు, కేరళ బ్యాక్ వాటర్స్, థార్ ఎడారీ అందాలు, హిమాలయ కొండల అందాలు, లక్షద్వీప్స్, అండమాన్ నికోబార్ లాంటి బీచ్ లను వివరించే ప్రయత్నం చేయండి. దీపావళి, హోలీ లాంటి పండుగల గురించి చిన్న చిన్న రీల్స్ షేర్ చేయండి. ఎక్కువ మందిని రీచ్ అయ్యేందుకు హిందీ లేదంటే స్థానిక భాషలను ఉపయోగించే ప్రయత్నం చేయండి.

⦿ బ్లాగ్, యూట్యూబ్ చానెల్ లా ప్రారంభించాలి?

బ్లాగ్ ప్రారంభించేందుకు వర్డ్ ప్రెస్, యూట్యూబ్ చానెల్  ఓపెన్ చేసేందుకు యూట్యూబ్ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. సింపుల్ గా ఫోన్‌ తో వీడియోలను రికార్డ్ చేసి, ఎడిట్ చేసి పోస్టు చేయాలి. మంచి వ్యూస్ పెంచుకునేందుకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ క్రియేట్ చేయండి.

⦿ ఫ్రీలాన్సర్‌ గా పని చేయండి

ప్రయాణ సమయంలో ఆన్ లైన్ లో పని చేసే అవకాశం ఉంటుంది. ఆర్టికల్స్ రాయడం, కోడింగ్ రాయడం చెయ్యొచ్చు. అప్‌ వర్క్, ఫివర్ర్ లాంటి వెబ్‌ సైట్‌ లలో ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలను పొందే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా లేదంటే వెబ్‌ సైట్లకు పని చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు.

⦿ ట్రావెల్ ఫోటోలను అమ్మేయండి

మీరు బాగా ట్రావెల్ చేసినట్టైతే, అద్భుతమై టూర్ ఫోటోలను తీయండి. దేవాలయాలు, మార్కెట్లు, పర్వతాలు, అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు, కనువిందు చేసే రివర్ వ్యూస్, అద్భుతమైన బర్డ్స్ ఫోటోలను తీయండి. షట్టర్‌ స్టాక్, ఎట్సీ లాంటి వెబ్‌ సైట్లలో ఫోటోలను అమ్ముకునే అవకాశం ఉంటుంది. వారణాసి ఘాట్లు, రాజస్థాన్ కోటలు సహా ప్రసిద్ధ ప్రదేశాల ఫోటోలను క్లిక్ చేయండి. ప్రత్యేక ఫోటోల కోసం మేఘాలయ రూట్ బ్రిడ్జి లాంటి ప్రదేశాలకు వెల్లండి.

⦿ చేతితో తయారు చేసిన వస్తువులను అమ్మండి

చేతితో తయారు చేసిన వస్తువులను ట్రావెల్ చేస్తున్న సమయంలో అమ్మే ప్రయత్నం చేయండి. స్థానిక కళాకారుల నుంచి నగలు, దుస్తులు, అల్లికలు సహా ఇతర వస్తువులను కొనుగోలు చేసి, వాటిని అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. మంచి లాభాలను పొందవచ్చు. Etsy, Instagramలో వాటిని ప్రమోట్ చేసి ఆన్‌ లైన్‌ లో అమ్మండి.

Read Also: రైలులోనే రెస్టారెంట్.. ఎక్కడో కాదు ఇండియాలోనే.. మీకూ అలా జర్నీ చేయాలని ఉందా?

Related News

Vande Bharat Sleeper: ఒకటి కాదు.. ఒకేసారి రెండు.. వచ్చేస్తున్నాయ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు!

Dasara Special Trains: దసరా వేళ రైల్వే గుడ్ న్యూస్, ముంబై నుంచి కరీంనగర్ కు స్పెషల్ ట్రైన్!

Sunrise Express: వావ్.. జపాన్ స్లీపర్ రైలు ఇలా ఉంటుందా? బెర్తులు భలే ఉన్నాయే!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు

Afghan Boy: విమానం ల్యాండింగ్ గేర్‌‌‌లో 13 ఏళ్ల బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ట్రావెల్

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Big Stories

×