Actor Kasturi : సినీ నటి కస్తూరి పేరు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్య ఈమె చేస్తున్న సినిమాలు, సీరియల్స్ కన్నా ఎక్కువగా వివాదాలతో బాగా ఫెమస్ అవుతుంది. నిత్యం ఏదొక టాపిక్ తో హైలెట్ గా నిలుస్తుంది. అవసరం లేకుండా కూడా ఆమె చేసే వ్యాఖ్యలు ఎంతగా దుమారం రేపుతున్నాయో అందరికి తెలిసిందే.. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన కస్తూరి తెలుగు వాళ్ళ పై సంచలన వాఖ్యలు చేసింది. ఆ విషయం పై సీరియస్ అవ్వడంతో ఆమె పై పలువురు కేసులు నమోదు చేశారు. మొన్నీమధ్య ఈమె ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈమెకు బెయిల్ వచ్చిందని తెలుస్తుంది.
ఈ నెల 3న చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన కస్తూరి.. తెలుగు వాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 300 ఏళ్ల క్రితం రాజుగారి అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే తెలుగు వారు తమిళనాడుకి వచ్చారని, ఇప్పుడు వాళ్లు తమిళ వాళ్లమని చెప్పుకుంటున్నారని కస్తూరి చెప్పింది. అంతేకాదు, వేరేవాళ్ల భార్యపై మోజుపడొద్దని, బహుభార్యాతత్వం వద్దని బ్రాహ్మణులు చెప్తుంటే వారిని తమిళులు కాదని ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చ నీయాంశంగా మారాయి. దీనిపై సీరియస్ అయిన బ్రాహ్మణుల సంఘం పెద్దలు ఆమె పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కస్తూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పాటుగా డిఎంకే పార్టీ నేతలపై కూడా ఆమె ఫైర్ అయింది. దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.. ఈ కేసులో శనివారం హైదరాబాద్‌లో అరెస్టయిన కస్తూరిని చైన్నె పుళల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమెకు ఈ కేసు పై 29 వ తేదీ వరకు రిమాండ్ విధించారు పోలీసులు. అయితే ఆమె ముందస్తు బెయిల్ కు అప్లై చేసుకుందనే వార్తలు కూడా వినిపించాయి. ఇలాంటి పరిస్థితులతో తనకు బెయిల్‌మంజూరు చేయాలని కోరుతూ ఎగ్మూర్ కోర్టులో కస్తూరి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. తాను సింగిల్ మదర్ అని, తనకు స్పెషల్‌చైల్డ్ ఉందని, ఆమెను తానే చూసుకోవాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. దీంతో కోర్టు ఆమె షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
అయితే కస్తూరిరికి వివాదాలు కొత్తేమి కాదు.. గతంలో ఇలా చాలా సార్లు నోరు జారి అడ్డంగా బుక్కయింది. అప్పటిలో ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయాల్లో కూడా చిచ్చు పెట్టాయి. ఇక ఇప్పుడు కూడా అలానే అడ్డంగా ఇరుక్కుంది. అయితే ఈసారి వివాదం కాస్త గట్టిగానే అవ్వడంతో ఆమె మెడకు చుట్టుకుంది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె పెట్టుకున్న పిటిషన్ వల్ల ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. ఇక కేరీర్ విషయానికొస్తే.. ఒకప్పుడు అడపా దడపా సినిమాలతో బిజీగా ఉండేది.. ఇప్పుడు తమిళ్, తెలుగు సీరియల్స్ లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ అలరిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఈమె పెట్టే పోస్టులు ఏ రేంజ్ లో చెప్పనక్కర్లేదు.. ఈ వయస్సులో కూడా తగ్గట్లేడు అనే టాక్ ను అందుకుంటుంది.