Game Changer: ఏ సీజన్ లో సినిమా ఉన్న లేకపోయినా కూడా ఖచ్చితంగా సంక్రాంతి సీజన్ లో మాత్రం కొన్ని సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉంటాయి. సంక్రాంతి డేట్ కోసం చాలా సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. ముఖ్యంగా అగ్ర నిర్మాత దిల్ రాజు సంక్రాంతి సీజన్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఖచ్చితంగా ఒక సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తారు. ఆ బ్యానర్ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు సంక్రాంతికి మంచి సక్సెస్ అందుకున్నాయి. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్ దిల్ రాజు నిర్మించిన సినిమాలకే ప్రాముఖ్యత ఇస్తారు. దిల్ రాజు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసుకునే విధంగానే కొన్ని సినిమాలు తీస్తూ ఉంటారు. అయితే ఈసారి రెండు రకాలుగా ప్లాన్ చేశాడు దిల్ రాజు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజెర్ అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 10వ తారీఖున సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు జనవరి 14వ తారీఖున సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా రిలీజ్ కానుంది.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజెర్ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న కారణంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్. ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ ను ప్లాన్ చేయనున్నారు. అయితే ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా సేవలు కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పటివరకు ఒక్క ఈవెంట్ కి కూడా ముఖ్యఅతిథిగా హాజరు కాలేదు. ఒకవేళ ఈ సినిమా ఈవెంట్ కు హాజరైతే… పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదట హాజరైన సినిమా ఈవెంట్ అవుతుంది.
Also Read : Hero Nikhil : హీరో నిఖిల్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా..?
వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కావలసి ఉంది. ఈ సినిమాతో పాటు భారతీయుడు 2 అనే సినిమా షూటింగ్ కూడా చేశాడు శంకర్. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. అసలు శంకర్ ఈ సినిమాని ఎలా తీశాడు.? కమల్ హాసన్ లాంటి హీరో ఈ కథను ఎలా ఒప్పుకున్నాడు అని చాలామంది విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. కం బ్యాక్ ఇండియన్ అని అన్నవాళ్లే గో బ్యాక్ ఇండియన్ అని కూడా అన్నారు. అంతలా ఈ సినిమాతో ఇరిటేట్ చేశాడు శంకర్. ఇక గేమ్ చేంజెర్ సినిమాతో మంచి కం బ్యాక్ ఇస్తాడు అని చాలామంది ఊహిస్తున్నారు. దీనిని శంకర్ ఎంత వరకు నిలబెట్టుకుంటాడో వేచి చూడాలి.