Satya dev: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంతమందికి విపరీతమైన టాలెంట్ ఉన్నా కూడా వాళ్లకు సరైన గుర్తింపు రాదు. సరిగ్గా యంగ్ హీరో సత్యదేవ్ కి ఇలానే జరుగుతుంది. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు సత్యదేవ్. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మి సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఇక్కడితో పూరితో మంచి పరిచయం ఏర్పడింది. పూరి జగన్నాథ్ చేస్తున్న కొన్ని సినిమాల్లో ఇప్పటికీ కనిపిస్తుంటాడు సత్యదేవ్. నటుడుగా తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్న తర్వాత హీరోగా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అయితే ఇప్పటివరకు సరైన బ్రేక్ సత్యదేవ్ కెరియర్ లో రాలేదు అని చెప్పాలి. సత్యదేవ్ కెరియర్ లో సరైన హిట్ సినిమా అంటే బ్లఫ్ మాస్టర్ అని చెప్పాలి. గోపి గణేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018 డిసెంబర్ లో విడుదలైంది.
వాస్తవానికి ఈ సినిమాకి థియేటర్స్ లో కంటే యూట్యూబ్ అమెజాన్ ప్రైమ్ లోనే ఎక్కువ ఆదరణ పొందింది. ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫారం లోకి రావడానికి అంటే ముందు చాలామంది ఈ సినిమాను చూసి మంచి హిట్ అవుతుంది అని ఊహించారట. అగ్ర నిర్మాత సురేష్ బాబు, బన్నీ వాసు లాంటి నిర్మాతలు కూడా ఈ సినిమాను చూసి సత్యదేవ్ ప్రశంసించారు. వాళ్లు డిస్ట్రిబ్యూట్ కూడా చేయాలని ఆలోచనలో ఉండేవాళ్ళు. అయితే కొన్ని కారణాల వలన అది జరగలేదు. ఆ తరువాత ఓటీటీ లో మంచి ఆదరణ లభించింది. ఆ కామెంట్స్ ను కొంతమంది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి చూపిస్తే అవి డబ్బులు కాదు కదా గురు అని అనేవాళ్లట. బ్లఫ్ మాస్టర్ సినిమా హిట్ అయి ఉంటే ఈ రోజు నా రేంజ్ వేరేలా ఉండేది. నేను కేవలం ఆ టైప్ ఆఫ్ కథలు ఎంచుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్లేవాడిని అంటే చెప్పుకొచ్చాడు.
Also Read : Game Changer: అమరావతి లో ఈవెంట్ ప్లానింగ్, పవన్ కళ్యాణ్ వస్తే ఫస్ట్ సినిమా ఈవెంట్ అవుద్ది
ఇక బ్లఫ్ మాస్టర్ సినిమా విషయానికి వస్తే సినిమా కూడా పూరి జగన్నాథ్ కైండ్ ఆఫ్ టెంప్లెట్ లో జరుగుతుంది. సత్యదేవ్ ఈ సినిమాలో నటించిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత సత్యదేవ్ కి మంచి అవకాశాలు వచ్చాయి. కానీ ఈ రేంజ్ హిట్ సినిమా అయితే మాత్రం ఒకటి కూడా కాలేదు. కేవలం నటుడుగానే కాకుండా కొన్ని సినిమాల్లో ప్రముఖ పాత్రలో కూడా కనిపిస్తున్నాడు సత్యదేవ్. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ అనే సినిమాలో విలన్ గా కనిపించి మంచి గుర్తింపును సాధించాడు. వాస్తవానికి విలన్ పాత్ర సత్యదేవ్ కి చేయాలని లేకపోయినా కూడా చిరంజీవి చెప్పిన మాటల వలన కన్విన్స్ అయి ఆ సినిమాలో నటించాడు. ఇక ప్రస్తుతం జీబ్రా అనే సినిమాతో నవంబర్ 22న ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు సత్యదేవ్. ఇక ఈ సినిమా ఎంత సక్సెస్ అందిస్తుందో వేచి చూడాలి.