Actress Khushboo: ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ (Khushboo) ఒకప్పుడు చాలామంది స్టార్ హీరోల సరసన నటించి, భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా నటనలో ఎదురులేని హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ఈమె, సూపర్ హిట్ సినిమాలలో కూడా నటించి, సౌత్ స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ఆరంభించిన ఈమె అప్పుడే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో నటించింది. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఖుష్బూ.. ఒకవైపు జబర్దస్త్ (Jabardasth) వంటి కార్యక్రమంలో జడ్జిగా కొనసాగుతూనే.. మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది.అంతేకాదు రాజకీయాల్లో కూడా యాక్టివ్గా తన బాధ్యతలను నిర్వర్తిస్తోంది.
ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ పై ఖుష్బూ కామెంట్స్..
ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె.. బీజేపీలో యాక్టివ్ మెంబర్గా ఉంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా వెంకటేష్ (Venkatesh) తొలి పరిచయంలో వచ్చిన ‘కలియుగ పాండవులు’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె, ఇప్పుడు సినీ పరిశ్రమలో మేల్ డామినేషన్ పై మాట్లాడి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఖుష్బూ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా రావాలి. ఇక ఈ మధ్యకాలంలోనే అరణ్మనై -4, మూకుత్తి అమ్మన్ -2 చిత్రాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తున్నాయి. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్(Salman Khan), రజనీకాంత్ (Rajinikanth), కమల్ హాసన్(Kamal Haasan), అమీర్ ఖాన్(Aamir Khan),షారుక్ ఖాన్(Shahrukh Khan) లాంటి హీరోలే సినిమాలలో ఎక్కువగా ఆధిపత్యం చాలాయిస్తున్నారు. డిజిటల్ కంటెంట్ వచ్చాక కూడా ఓటీటీ లో మహిళలు టాలెంట్ చూపించడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ ఎవరు కూడా దానిని సరిగా వాడుకోవడం లేదు” అంటూ ఖుష్బూ కామెంట్ చేసింది. ఇక ఈమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఖుష్బూ కెరియర్..
‘కలియుగ పాండవులు’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఖుష్బూ.. ఆ తర్వాత పెద్దన్న, రామబాణం, తేనెటీగ, రాక్షస సంహారం, జయసింహ, స్టాలిన్, పేకాట పాపారావు, అజ్ఞాతవాసి వంటి చిత్రాలలో నటించింది. ఇక ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే, ఈమె ప్రజల పట్ల, సమాజం పట్ల చాలా అవగాహన కలిగి ఉంది.గొప్ప హేతువాది కూడా.. ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె, కొన్నేళ్ళ క్రితం అనుకోకుండా ఈమె కళ్ళ ఎదుట ఒక సంఘటన జరిగిందట చాలామంది పిల్లలు ఆ సంఘటనలో చనిపోయారట. అప్పుడే ఆమె ఆలోచనలు కూడా మారిపోయాయి. దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటి సంఘటనలు ఎందుకు అవుతాయి అని ఆ రోజు నుంచి తనకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తోందట. అలాగే తన పిల్లల్ని కూడా ఆ వైపు వెళ్లకుండా స్వేచ్ఛగా వారిని పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఖుష్బూ బిజెపి పార్టీలో కూడా కీలకంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.