BigTV English

Pradeep Ranganathan: ‘డ్రాగన్’ హీరో రేంజ్ వేరయా..ముగ్గురితో రొమాన్స్..

Pradeep Ranganathan: ‘డ్రాగన్’ హీరో రేంజ్ వేరయా..ముగ్గురితో రొమాన్స్..

Pradeep Ranganathan: కొలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో యంగ్ హీరోల పేర్లలో ప్రదీప్ రంగనాథన్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో హీరో అనేక సినిమాలో నటించాడు. కానీ రీసెంట్గా డ్రాగన్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు వచ్చిన అంత క్రేజ్ గతంలో ఏ సినిమాకు రాలేదు. దాంతో హీరో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాడు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా మాత్రమే కాదు ఆయన తీసిన సినిమాలకు ఆయనే దర్శకత్వం వహించడంతో అతని పేరు ఇండస్ట్రీలో హైలైట్ అవుతుంది. డ్రాగన్ మూవీ తో భారీ విజయాన్ని అందుకోవడంతో ఇతనితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఈయన ఓ సినిమాను లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఆ మూవీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్ల తో రొమాన్స్ చెయ్యబోతున్నట్లు తెలుస్తుంది.. ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..


ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం లో వచ్చిన డ్రాగన్ మూవీ చిన్న సినిమా గా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ ఏకంగా 150 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ‘ఎల్‌కే’ చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని ఆసక్తి అందరిలో నెలకొంది. కానీ ప్రదీప్ మాత్రం నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించినట్లు కనిపించలేదు. నిజానికి ఈ హీరో తో సినిమాలు చేయడానికి పలు నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

Also Read:ఇట్స్ అఫీషియల్.. మరోసారి వాయిదా పడ్డ వీరమల్లు..


మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్న భారీ చిత్రం లో ప్రదీప్‌ రంగనాథన్‌ కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారన్న ప్రచారం సోషల్ మీడియా లో వినిపిస్తుంది. మహిళా దర్శకురాలు సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్.. ఇందులో ప్రేమలు చిత్రం ఫేమ్‌ మమిత బైజూ నాయకిగా నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. కాగా తాజాగా నటి అనూ ఇమాన్యుల్ కూడా ఫిక్స్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీళ్ళతో పాటుగా మరో సీనియర్ హీరోయిన్ ఐశ్వర్య శర్మ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.. ముగ్గురు హీరోయిన్లతో అంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందని సినీ అభిమానులు ఇప్పటినుంచే ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ కుర్ర కథానాయకుడిగా నటించిన మూడు చిత్రాలు విజయం సాధించాయి. అందులో రెండు చిత్రాలకు ప్రదీప్‌ రంగనాథన్‌నే దర్శకుడు కావడం విశేషం.. ఇలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అందుకే ఇతని క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×