Actress Laya: సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా మంచి సక్సెస్ అందుకున్న లయ(Laya) ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. భద్రం కొడుకు అనే సినిమా ద్వారా ఈమె బాలనటిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అనంతరం హీరోయిన్ గా స్వయంవరం అనే సినిమాలో అవకాశం అందుకొని హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాలో తన నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ఈమె మొదటి సినిమాకే నంది అవార్డు(Nandi Award) అందుకోవటం విశేషం. ఇలా మొదటి సినిమా మంచి సక్సెస్ కావడంతో లయ అనంతరం తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.
అమెరికాలో…
ఇక ఈమె హీరోయిన్ గా ప్రేమించు, మనోహరం, నీ ప్రేమకై, మనసున్న మారాజు, హనుమాన్ జంక్షన్ వంటి ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఇలా తన కెరియర్ మంచి పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే లయ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లే స్థిరపడ్డా.రు ఈమె భర్త ప్రముఖ డాక్టర్ కావడంతో అక్కడే ఉండిపోయారు. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన లయ పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు. ఇకపోతే దాదాపు 20 సంవత్సరాల తర్వాత తిరిగి ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.
కండీషన్లు లేవు
డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్(Nithin) హీరోగా నటించిన తమ్ముడు(Thammudu) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఈమె నితిన్ కు అక్క పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో లయ కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయినప్పటికీ నా మనసు మాత్రం ఇండియాలోనే ఉందని తెలియజేశారు. దాదాపు 20 సంవత్సరాలు తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి రావడంతో ఏదో నా సొంత ఇంటికి నేను వచ్చిన అనుభూతి కలుగుతుందని తెలిపారు. ఇక పెళ్లి తర్వాత సినిమాలలో నటించకూడదని ఏమైనా కండిషన్లు పెట్టారా? అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ తన భర్త సినిమాల విషయంలో ఎప్పుడు ఎలాంటి కండిషన్లు పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు.
హీరోయిన్ గా చేయాలని ఉంది..
ఇక పిల్లలు చిన్నవాళ్లు కావడంతో వారికి తప్పనిసరిగా తన అవసరం ఉంటుందని సినిమాలకు ఈమె దూరమైనట్టు తెలిపారు. ఇక ప్రస్తుతం పాప తాను లేకపోయిన తను పనులు చేసుకుంటూ బాబు పనులు కూడా చేయగలరని లయ తెలిపారు. ప్రస్తుతం వారి సపోర్ట్ కారణంగానే నేను తిరిగి ఇండియాకి వచ్చి సినిమాలలో నటిస్తున్నానని తెలిపారు.. సినిమా ఇండస్ట్రీకి దూరమైన కొద్దిరోజులు ఏవైనా సినిమా చూసినప్పుడు ఒకవేళ నేను ఇండస్ట్రీలో ఉంటే ఈ సినిమాలో నాకు చాన్స్ వచ్చేదేమో..అనే అనుభూతి కలిగేదని తెలిపారు. మరి ఇప్పటికైనా సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే నటిస్తారా? అనే ప్రశ్న ఎదురవడంతో తప్పకుండా నటిస్తానని తెలిపారు. ఇలా ఇండస్ట్రీని వదిలిపెట్టి 20 సంవత్సరాలైనా ఇంకా హీరోయిన్గా నటించాలని కోరిక మాత్రం ఈమెలో బలంగా ఉందని మరి ఈమె కోరికను మన్నించి ఏ దర్శకుడైన తనకు హీరోయిన్ గా అవకాశం ఇస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.