Hrithik Roshan: ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సెలబ్రిటీస్ తమ పాత ఆస్తులను అమ్మేస్తూ వస్తున్నారు. అమితాబచ్చన్, ప్రియాంక చోప్రా, బోనీ కపూర్ ఇలా వరుసగా సెలబ్రిటీస్ ముంబైలో ఉన్న తమ ఇళ్ళను అమ్మేస్తున్నారు. అయితే ఆ ఇళ్ళను ఎందుకు అమ్ముతున్నారు..? అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. తాజాగా వీరి లిస్టులో బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కూడా చేరాడు. అందుతున్న సమాచారం ప్రకారం హృతిక్ తన తండ్రి రాకేష్ రోషన్ తో కలిసి ముంబైలో ఉన్న మూడు ఫ్లాట్స్ ను విక్రయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ముంబైలోని అంధేరి వెస్ట్ లో ఉన్న మూడు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ను హృతిక్ రోషన్ దాదాపు రూ 6.75 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తుంది. అయితే ఈ మూడు ఫ్లాట్స్ లో రెండు ఫ్లాట్స్ రాకేష్ రోషన్ పేరు మీద ఉండగా ఒక ఫ్లాట్ మాత్రం హృతిక్ ది అని తెలుస్తుంది. ఇంత సడన్ గా ముంబైలోని ఫ్లాట్స్ ను ఈ తండ్రీకొడుకులు ఎందుకు విక్రయించారు..? వారికి అంత కష్టం ఏమొచ్చింది..? అనే విషయం మాత్రం ఇంకా తెలియ రాలేదు. దీంతో నెటిజన్స్ హృతిక్ నష్టాల్లో కానీ, కష్టాల్లో కానీ ఉన్నదేమో అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు.
ఇకపోతే హృతిక్ రోషన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాత రాకేష్ రోషన్ నట వారసుడిగా హృతిక్ బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. మంచి మంచి కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ముఖ్యంగా తన ఫిట్ బాడీతో బాలీవుడ్ గ్రీకువీరుడు అనే బిరుదును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం హృతిక్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే వార్ 2 సినిమా షూటింగ్ ను కూడా ఫినిష్ చేశాడు.
వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంతోనే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతోపాటు భారీ అంచనాలను నెలకొల్పేలా చేసింది. ఒకపక్క హృతిక్.. ఇంకో పక్క ఎన్టీఆర్ వీరిద్దరి యాక్షన్ సన్నివేశాలను వెండితెరపై చూడడానికి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
వార్ 2 తరువాత హృతిక్.. క్రిష్ 4 మూవీ తీసేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును రాకేష్ రోషన్ నిర్మిస్తున్నాడు. దీనికి హృతిక్ రోషనే దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసమేఈ తండ్రీకొడుకులు ఆ ఫ్లాట్స్ ను అమ్మేసినట్లు బాలీవుడ్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్ సినిమా హృతిక్ కు ఎంత పేరు తీసుకొచ్చి పెట్టిందో అందరికీ తెలిసిందే. తెలుగువారిని సైతం అతనికి ఫిదా అయ్యేలా చేసింది. ఆ తరువాత వచ్చిన క్రిష్ 2, క్రిష్ 3 సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి .ఇక ఇప్పుడు ఈ సినిమాను కూడా హృతిక్ భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడని సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే క్రిష్ 4ను అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.