Actor Pragathi : టాలీవుడ్ యాక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ( Pragathi) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో హీరో, హీరోయిన్లకు తల్లిగా నటించింది. 24 ఏళ్ల వయసులోనే తన వయసున్న హీరోయిన్‌కు తల్లిగా నటించారు. క్లాస్ లుక్‌లో తల్లి, అక్క, వదిన వంటి క్యారెక్టర్లలో ఒదిగిపోయారు.. ఈమె ఈ మధ్య సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలోనే హైపర్ యాక్టివ్ ఉంటుంది. ఇక వయసుతో సంబంధం లేకుండా ఆమె జిమ్ లో చేసే కసరత్తులు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాగే వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో కూడా ఆమె పాల్గొంటూ అమ్మాయిలకు షాక్ ఇస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా ప్రగతి గురించి ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ వార్తలపై ప్రగతి స్పందించింది. ఇంతకీ ఏమన్నారంటే…
నిజానికి ప్రగతి ఏపీలో జన్మించినప్పటికి కూడా మైసూర్ సిల్క్ ప్యాలెస్‌కు మోడల్‌గా వ్యవహరించారు. సినిమాలపై ఆసక్తితో అటుగా అడుగులు వేసింది. మద్రాస్ వెళ్లిన ప్రగతికి తమిళనటుడు భాగ్యరాజ్ అవకాశం కల్పించారు. ఈయన తెరకెక్కించిన వీట్ల విశేషాంగ సినిమాతో ప్రగతి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.. అలా తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కెరియర్ సాఫీగా సాగుతున్న టైం లోనే ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత చాలామంది ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు ఈమె కూడా దాదాపు మూడు నాలుగు ఏళ్ళు పాటు ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు.. ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంది. సినిమాలు కాకుండా సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయింది.
ఈమె వయసు పెరిగిన కూడా మనసుకి ఇంకా కుర్రతనం పోలేదన్నట్లు సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలతో యువతకు షాక్ ఇచ్చేలా చేస్తుంది ప్రగతి.. గత ఏడాది ఈమె వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొన్న సంగతి తెలిసిందే.. ఆ పోటీల్లో విజయం సాధించి పథకాన్ని పొందారు.. అయితే గత కొద్ది రోజులుగా నటి ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతున్న అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. ఈ వార్తలు పై ప్రగతి పెద్దగా పట్టించుకోలేదు కానీ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ని షేర్ చేసుకుంది. చిన్న వయసులోనే వివాహం చేసుకున్నప్పటికీ భర్త తీరుతో విసిగిపోయిన ఆమె అతనికి విడాకులు ఇచ్చి కుమార్తెతో పాటు బయటకు వచ్చేశారు.. ఇప్పుడు పెళ్లి పై వస్తున్న వార్తల పై ఓ ఇంటర్వ్యూ లో బయట పెట్టారు. జీవితంలో ఒక తోడు అనేది అవసరం అవుతుంది అయితే సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి చాలా మంచి వ్యక్తి అయి ఉండాలి. మొదటిదానిలాగే మొదటికే మోసం వస్తుందని ఆమె అన్నారు. మొత్తానికైతే ఆమె మనసులో పెళ్లి చేసుకోవాలని కోరుకున్నట్లు బయటపెట్టారు. ఇక త్వరలోనే తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారేమో చూడాలి..