OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో కొరియన్ సినిమాలకి ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు మన ప్రేక్షకులు కొరియన్ సినిమాలను, వెబ్ సిరీస్ లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. టీవీ సీరియల్స్ చూస్తున్నట్టు కొరియన్ వెబ్ సిరీస్ లను కూడా చూస్తున్నారు. అలాగే చైనీస్ సినిమాలు కూడా మంచి కధలతో తెరమీదకు వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చైనీస్ రొమాంటిక్ మూవీ సరదాగా సాగిపోతూ ఉంటుంది. చదువులో వెనకబడిన ఒక వ్యక్తి డిగ్రీ పాస్ అవ్వడానికి కాలేజీలో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ కొరియన్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
యూట్యూబ్ (YouTube) లో
ఈ చైనీస్ రొమాంటిక్ మూవీ పేరు ‘యకోజా క్యాంపస్’ (Yakoja Campus). 2016 లో రిలీజ్ అయిన ఈ చైనీస్ రొమాంటిక్ మూవీకి మింగ్ యాన్ దర్శకత్వం వహించాడు. ఇద్దరు ధనవంతుల పిల్లలు చదువుకోవడానికి కాలేజీకి వస్తారు. వాళ్ళు ప్రేమలో కూడా పడతారు. మూవీ స్టోరీ సరదాగా సాగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ రొమాంటిక్ మూవీ యూట్యూబ్ (YouTube) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో ఒక పెద్ద బిజినెస్ మాన్ కొడుకు. చదువుకోకుండా రౌడీ పనులు చేసుకుంటూ ఉంటాడు. ఇద్దరు పోకిరీలను వెనక వేసుకొని డాన్ లా ఫీల్ అవుతుంటాడు. అయితే తండ్రి తర్వాత కంపెనీకి సీఈవో అవసరం వస్తుంది. కొడుక్కి అంత మంచి పేరు లేకపోవడంతో, కొంతమంది తమ కొడుకులను సీఈవో చేయాలని అంటూ ఉంటారు. కనీసం డిగ్రీ కూడా లేదని హేళన చేస్తారు. అప్పుడు హీరో నేను బాగా చదివి డిగ్రీ పట్టా తీసుకొని వస్తానని వెళ్తాడు. అలా డిగ్రీ పాస్ అవ్వడానికి కాలేజీలో జాయిన్ అవుతాడు. అదే కాలేజీలో హీరోయిన్ కూడా జాయిన్ అవుతుంది. హీరో, హీరోయిన్లు చిన్నపాటి గొడవలతో జర్నీ స్టార్ట్ చేస్తారు. అయితే టీచర్ కి హీరోకి చిన్న పాటి గొడవలు జరుగుతాయి. టీచర్ హీరో పై ఎప్పుడూ కోపం గా ఉంటాడు. మరోవైపు హీరో అదే కాలేజీలో నర్స్ గా పనిచేసే ఒక అమ్మాయిని హీరో ఇష్టపడతాడు. అయితే హీరోయిన్ అతనికి తనదైన స్టైల్ లో బుద్ధి చెబుతుంది.
మరోవైపు తండ్రి తన కొడుకు బాగా చదువుతాడని నమ్మకంతో ఉంటాడు. హీరో మాత్రం చదువుకోకుండా గేమ్స్ ఆడుకుంటూ టైంపాస్ చేస్తుంటాడు. ఆ తర్వాత హీరో, హీరోయిన్లు ప్రేమలో బిజీ అయిపోతారు. నిజానికి వీళ్ళ తల్లి దండ్రులు వాళ్ళను ప్రేమించు కోవడానికే కాలేజీకి హీరోయిన్ ను పంపుతారు. అయితే ప్రేమ సక్సెస్ అవుతుంది. చదువులో వెనకబడి వుంటాడు హీరో. చివరికి హీరో డిగ్రీ పాస్ అవుతాడా? తన తండ్రి కంపెనీకి సీఈఓ అవుతాడా? దద్దమ్మ లాగా ఉండిపోతాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ (YouTube) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘యకోజా క్యాంపస్’ (Yakoja Campus) అనే ఈ చైనీస్ రొమాంటిక్ మూవీని చూడాల్సిందే.