BigTV English

Pranitha Announced 2nd Pregnancy: మళ్లీ తల్లి కాబోతున్న హీరోయిన్ ప్రణీత.. బేబీ బంప్ ఫొటోలు వైరల్

Pranitha Announced 2nd Pregnancy: మళ్లీ తల్లి కాబోతున్న హీరోయిన్ ప్రణీత.. బేబీ బంప్ ఫొటోలు వైరల్

Pranitha Subhash 2nd Pregnancy(Latest news in tollywood): హీరోయిన్ ప్రణీత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఎన్నో చిత్రాలలో నటించింది. ప్రణీత మొదట పూరిజగన్నాథ్ తెలుగులో తీసిన పోకిరి సినిమా రీమేక్ “పోర్కీ” అనే మూవీతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత “ఏం పిల్లో ఏం పిల్లడో” మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ మూవీ తర్వాత సిద్దార్ద్ హీరోగా నటించిన బావ సినిమాతో హీరోయిన్ గా అలరించింది. తెలుగులో అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, భ్రహ్మోత్సవం వంటి హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది.


2021లో బెంగుళూరుకి చెందిన బిజినెస్‌మాన్ నితిన్ రాజూని ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రణీత. ప్రణీత నితిన్ లకు 2022లో ఒక పాప పుట్టింది. ఇప్పుడు బిజెనెస్ తో పాటు,  పలు షోలో జెడ్జ్ గా వ్యవహరిస్తున్న ప్రణీత మళ్లీ తల్లి కాబోతున్నట్లు గుడ్ న్యూస్ ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. త్వరలో మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్న ప్రణీత, నితిన్‌లకు తమ స్నేహితులు కలిసి సర్ప్రైజ్ బేబీ షవర్ పార్టీనీ ఏర్పాటు చేశారు. బేబీ షవర్ లో ఎంతగానో ఎంజాయ్ చేస్తూ కనిపించింది ప్రణీత.

బేబీ బంప్ ఫొటోలతో ఉన్న కొన్ని వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేస్తూ రౌండ్-2.. ఈ ప్యాంట్స్ నాకు ఫిట్ అవ్వవు అంటూ.. కాప్షన్ ఇచ్చి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫొటోలు చూసిన ఫాన్స్ తనకి కంగ్రాట్స్ చెబుతూనే.. ఇంకొంత మంది ఇంత త్వరగా ఏంటి మేడం అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Also Read: బాబాయ్ పవన్ ను అంతమాట అనేసిందేమిటి నిహారిక?

ఇక ప్రస్తుతం కన్నడ నుంచి వచ్చిన చాలా మంది హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో పాగా వేసి మంచి గుర్తింపు పొందిన వాళ్లు చాలామందే ఉన్నారు. రష్మిక, నభా నటేష్. ఆషికా వంటి ఈ భామలు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ప్రణీత కూడా కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయివుండేదేమో.. కానీ మ్యారేజ్ చేసుకుని ఫామిలీకి దగ్గరై సినీ కెరీర్ కి గుడ్ బై చెప్పింది. తెలుగులో తీసిన అత్తారింటికి దారేది సినిమాలో “అమ్మో బాపుగారి బొమ్మో” సాంగ్ మాత్రం ఇప్పటికీ ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×