BigTV English
Advertisement

Netanyahu | ‘ఇరాన్ కోసం పనిచేసే మూర్ఖులు’.. అమెరికా నిరసనకారులపై మండిపడిన ఇజ్రాయెల్ ప్రధాని

Netanyahu | ‘ఇరాన్ కోసం పనిచేసే మూర్ఖులు’.. అమెరికా నిరసనకారులపై మండిపడిన ఇజ్రాయెల్ ప్రధాని

Netanyahu | ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెత్యన్యాహు అమెరికాలో నిరసనకారులపై మండిపడ్డారు. వారంతా ఇరాన్ కోసం పనిచేసే మూర్ఖులని ఎద్దేవా చేశారు. బుధవారం అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో ఆయన ప్రసంగం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో వేలాది మంది అమాయక పౌరులు చనిపోతున్న నేపథ్యంలో యుద్ధం ఆపేందుకు అమెరికా.. ఇరు వర్గాల మధ్య ఒక డీల్ కుదుర్చింది. ఈ సీజ్ ఫైర్ డీల్ ఇష్టంలేకపోయినా ఇజ్రాయెల్ అంగీకరించాల్సి వస్తోంది. యుద్ధం ఆగిపోతుంది.. అని ప్రపంచ దేశాలకు అమెరికా ఎంత చెబుతున్నా ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీన పౌరుల శరణార్థి శిబిరాలపై దాడులు చేస్తూనే ఉంది. ఆ దాడుల్లో వందల సంఖ్యలో పిల్లలు, మహిళలతో సహా ప్రజలు చనిపోతున్నారు. దీంతో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా అమెరికాలో తరుచూ భారీ నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంతో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెత్యన్యాహు అమెరికా పర్యటనకు వెళ్లారు. నెత్యన్యాహు ప్రసంగం చేస్తుండగా.. వైట్ హౌస్ ఎదుట నిరసనకారులు ధర్నా చేశారు. పాలస్తీనా జెండాల ఎగరేసి.. అమెరికా జెండాలకు నిప్పంటించారు.

యుద్ధంలో ఇజ్రాయెల్ మిలిటరీ ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికా ప్రభుత్వానికి కూడా నినాదాలు చేశారు. ఇప్పటికే పలు దేశాలు నెత్యన్యాహుని వార్ క్రిమినల్ అని ప్రకటించడంతో.. నెత్యన్యాహు లాంటి వార్ క్రిమినల్ ని అమెరికాలో అనుమతించకూడదని నినాదాలు చేస్తూ.. వైట్ హౌస్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిపై పెప్పర్ స్ప్రే ఉపయోగించారు. నిరసనకారుల్లో 200 మందికి పైగా అరెస్టు చేశారు.


Also Read:  ‘నువ్వు ఆడదానివి.. నీకేం తెలుసు.. మాట్లాడకు..’ మళ్లీ నోరుజారిన బిహార్ సిఎం!

అమెరికాలోని రెండు రాజకీయ పార్టీలు డెమొక్రాట్స్, రిపబ్లకన్స్ సభ్యలనుద్దేశించి నెత్యన్యాహు ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో ఆయన అమెరికా చేస్తున్న సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా అమెరికా ఎన్నికల సమీపిస్తున్న సందర్భంతో అధ్యక్షుడు జోబైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరినీ ప్రశంసించారు. ఆ తరువాత తన ప్రసంగంలో ఇరాన్, అమెరికా నిరసనకారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ”బయట నిరసన చేస్తున్న నిరసనకారులు ఇరాన్ తొత్తులు, ఇరాన్ అందించే ధన సహాయంతో ఇదంతా చేస్తున్నారు. అయితే వారంతా మూర్ఖులు. ఇరాన్ కోసం పనిచేస్తున్నారు. ఒక ట్రాన్స్ జెండర్ ని, గే వ్యక్తిని ఉరితీయడం.. మహిళలు బుర్కా ధరించకపోతే వారిని కఠినంగా శిక్షించే ఇరాన్ లాంటి దేశాలను సమర్థిస్తున్నారు,” అని నెతన్యాహు అన్నారు. ఆయన ప్రసంగంపై అమెరికా ఇరు పార్టీల నాయకులు చప్పట్లు కొట్టారు.

అయితే నెతన్యాహు రాకను అమెరికా రాజకీయ నాయకులలో సగం మంది బాయ్ కాట్ చేశారు. అమాయక పాలస్తీనా వాసులను యద్ధం పేరులో హత్య చేయడం ఎంతవరకు న్యాయం అని అంటున్నారు. ముఖ్యంగా నెతన్యాహు ప్రసంగం మధ్యలో రిపబ్లికన్ పార్టీకి చెందిన రాషిదా తులైబ్ అనే మహిళ కన్నీళ్లతో పైకి లేచి.. ‘నెతన్యాహు ఒక వార్ క్రిమినల్’ అనే సైన్ బోర్డుని చూపించారు. నెత్యన్యాహుని వ్యతిరేకించిన అమెరికా సెనేటర్లలో క్రిస్ వాన్ హోల్లెన్ , థామస్ మాస్సీ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ గురువారం నెతన్యాహుతో అధికారికంగా సమావేశం కానున్నారు.

మరోవైపు ఇజ్రాయెల్ తో యుద్దం చేస్తున్న హమాస్.. నెత్యన్యాహు చర్యలు ఖండించింది. యుద్ధం ఆపేందుకు తాము సిద్ధంగా ఉన్నమని.. తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడిచిపెట్టేందుకు తాము అంగీకరించినా.. కావాలనే నెత్యన్యాహు ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని హమాస్ ప్రతినిధి తెలిపారు.

Tags

Related News

Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

Big Stories

×