BigTV English

Actress Raasi: స్టార్‌ డైరెక్టర్‌ నా జీవితం నాశనం చేశాడని నటి ఆవేదన

Actress Raasi: స్టార్‌ డైరెక్టర్‌ నా జీవితం నాశనం చేశాడని నటి ఆవేదన

Actress Raasi Made Sensational Comments On Nijam Movie Behind Scenes: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌డమ్ తెచ్చుకున్న వారు ఎందరో నటీనటులు ఉన్నారు. ఆ కోవలోకే ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న నటి రాశి.ముద్దుగా, బొద్దుగా ఉండే రాశి 90s లో దక్షిణాదిన అగ్రహీరోయిన్ జాబితాలో ఓ వెలుగు వెలిగింది.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హింది వంటి భాషల్లో 100 పైగా మూవీస్‌లో నటించి అందరి చేత హౌరా అనిపించుకున్నారు. ఇక రాశి అసలు పేరు రవళి. కానీ వెండితెరకు విజయలక్ష్మీగా ఇంట్రడ్యూస్ అయ్యారు. రాశి తాత చెన్నైలో మూవీస్‌కి జూనియర్ ఆర్టిస్ట్‌లను పంపించే ఏజెంట్‌గా వర్క్‌ చేసేవారట. రాశి అన్నయ్య బిజినెస్‌మెన్‌.ఆమె 10వ తరగతి వరకు చదువుకుని హీరోయిన్‌గా మారిన తర్వాత బీఏ లిటరేచర్ చేశారు.


రాశి మొట్టమొదటిసారిగా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా రావుగారి ఇల్లు, బాల గోపాలుడు, చెట్టుకింద ప్లీడర్‌, ఆదిత్య 369, పల్నాటి పౌరుషం సినిమాల్లో యాక్ట్ చేశారు. తమిళ్‌లో ప్రియం మూవీతో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇక టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పెళ్లి పందిరి, గోకులంలో సీత, శుభాకాంక్షలు, డాడీ,సముద్రం, ప్రేయసి రావే, మూడు ముక్కలాట, వంటి హిట్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా యాక్ట్ చేసి ఆడియెన్స్‌ని అలరించారు. ఆ తరువాత రాశికి మూవీ ఛాన్సులు తగ్గడంతో 2005లో శ్రీముని అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. పెళ్లి, పిల్లలతో వైవాహిక జీవితాన్ని గడుపుతున్న రాశి మూవీస్‌కి పుల్‌స్టాప్ పెట్టారు.

Also Read: ఓటీటీలోకి విజయ్‌ సేతుపతి హిట్ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?


అయితే తనతో పాటుగా నటించిన నటీనటులు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడంతో రాశి రీ ఎంట్రీ ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే తమిళంలో ఒన్‌బాధలే గురు మూవీలో నటించారు.ఆ వెంటనే తెలుగులోనూ కళ్యాణ వైభోగమే,పడేశావే,ఆకతాయి,లంక వంటి చిత్రాల్లో తల్లి క్యారెక్టర్లు చేశారు.మరోవైపు బుల్లితెరపైనా ఎంట్రీ ఇచ్చి గిరిజ కళ్యాణం,జానకి కలగనలేదు అనే సీరియల్స్‌లో నటించారు. సముద్రం, వీడే, వెంకీ సినిమాలలో ఐటెం సాంగ్స్‌తోనూ రాశి ఆడియెన్స్‌ని అలరించారు.ఇటీవలి కాలంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న రాశి.. తన కెరీర్ ఇలా కావడానికి ఓ సినిమాలో వేసిన క్యారెక్టరే కారణమన్నారు.ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా. అదే సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన నిజం. ఈ మూవీలోని మల్లి క్యారెక్టర్ కారణంగా తాను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని ఇందులో గోపీచంద్‌తో పరిమితికి మించి రొమాంటిక్ సీన్లలో యాక్ట్‌ చేయడంతో నా మూవీ కెరీర్‌ నాశనం అయ్యి, నా కొంప ముంచిందని రాశి చెప్పారు.దర్శకుడు తేజ డైరెక్షన్‌లో వచ్చిన నిజం సినిమాలో తన రోల్‌ గురించి చెప్పింది ఒకటి, చూపించింది మరొకటని తన ఆవేదనని వ్యక్తం చేశారు నటి రాశి. అలా చేయకపోయి ఉంటే నా సినీ కెరీర్‌ మరోలా ఉండేదని వాపోయింది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×