BigTV English
Advertisement

Rameshwari on Mahesh Babu : మహేష్ బాబు నన్ను మూడు సార్లు కిందపడేశాడు.. ఆ షాకింగ్ ఘటనపై నటి రామేశ్వరి కామెంట్స్

Rameshwari on Mahesh Babu : మహేష్ బాబు నన్ను మూడు సార్లు కిందపడేశాడు.. ఆ షాకింగ్ ఘటనపై నటి రామేశ్వరి కామెంట్స్

Rameshwari on Mahesh Babu : నటి రామేశ్వరీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సీతామహాలక్ష్మి సినిమాలో లీడ్ రోల్ లో కనిపించారు. ఆ సినిమాకి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. హిందీ ఒడియా మరియు తెలుగు భాషల్లో అనేక సినిమాలు చేశారు. తేజ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన నిజం సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయిన కూడా ఇప్పటికీ ఆ సినిమాకి ఒక కల్ట్ స్టేటస్ ఉంది. నిజం సినిమాలో మహేష్ బాబు కి తల్లిగా రామేశ్వరీ నటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సినిమా కమర్షియల్ గా హిట్ అవడం వలన అది నిజం సినిమాకి మైనస్ గా మారింది. ఒకడు సినిమా మహేష్ బాబుకి విపరీతమైన స్టార్డం తీసుకొచ్చింది. ఆ టైంలో మహేష్ బాబుని నిజం సినిమాలోని పాత్రను సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయారు. ఇదే విషయాన్ని తేజ కూడా పలు సందర్భాల్లో చెప్పారు.


నటి రామేశ్వరి రీసెంట్ గా రిలీజ్ అయిన బ్రహ్మానందం సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు. ఆర్ వి ఎస్ నిఖిల్ దర్శకుడిగా పరిచయమైన బ్రహ్మానందం సినిమా ఫిబ్రవరి 14న బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైంది. ఈ సినిమా డీసెంట్ పాజిటివ్ టాక్ అందుకుంది. ఇదే సినిమాతో పాటుగా రిలీజ్ అయిన లైలా సినిమా డిజాస్టర్ టాక్ అందుకోవడంతో ఈ సినిమాకి కొంతమేరకు ప్లస్ అయింది. ఇక బ్రహ్మానందం సినిమాలో నటి తాళ్లూరి రామేశ్వరి పాత్ర విపరీతంగా ఆకట్టుకుంది. వాస్తవానికి సినిమా కూడా బ్రహ్మానందం మరియు ఈమె పాత్రల మధ్యనే నడుస్తుంది. చాలా రోజుల తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆమెకి సరైన పాత్ర దక్కింది అని చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో కూడా ఈమె కనిపించింది చాలా తక్కువ సేపు అయినా కూడా ఆమె డైలాగ్స్ ఇప్పటికీ ఇంస్టాగ్రామ్ రీల్స్ లో వైరల్ అవుతుంటాయి.

బ్రహ్మానందం సినిమా రీసెంట్ గా రిలీజ్ అయిన తరుణంలో రామేశ్వరి పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు. రీసెంట్ గా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె నిజం సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వాస్తవానికి నిజం సినిమాకి సంబంధించి ఆమెకంటే ముందు చాలామందిని సంప్రదించారట. నటి జయసుధ కూడా అడిగితే ఫిజికల్ గా ఈ సినిమాను నేను చేయలేను అంటూ చెప్పుకొచ్చారట. దీని కారణం ఈ సినిమాలో బైక్ పై వెళ్లే సీన్స్ ఎక్కువగా ఉండటం, యాక్షన్ సీక్వెన్స్ తో కూడుకున్న సన్నివేశాలు ఉండటం వలన జయసుధ ఈ సినిమాకి నో చెప్పారు. దర్శకుడు తేజ రామేశ్వరి గారికి ఫోన్ చేసి మా దగ్గర ఇలా ఒక పాత్ర ఉంది మీరైతే బాగుంటారు అని క్షుణ్ణంగా చెప్పారట. వెంటనే ఆ కథ నచ్చి ఆవిడ సినిమాని చేశారు.


నిజం సినిమా షూటింగ్ జరుగుతున్న తరుణంలో మహేష్ బాబు తనని బండి పైనుంచి మూడుసార్లు కింద పడేసాడు అని చెప్పుకొచ్చారు. మొదటిసారి పడినప్పుడు చాలా తీవ్రంగా దెబ్బలు తగిలాయట, ఆ తర్వాత చిన్న చిన్న మైనర్ యాక్సిడెంట్స్ జరిగాయి అంటూ చెప్పుకొచ్చారు. నిజం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదో ఒక ఫంక్షన్ లో మహేష్ బాబుని చూశారట. కొన్ని రోజుల తర్వాత మహేష్ బాబు మీరు కూడా ఆ ఫంక్షన్ వచ్చారా అని అడిగారట, వచ్చి నాతో ఎందుకు మాట్లాడలేదు అని మహేష్ అడిగితే, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని రామేశ్వరి అన్నారు. దానికి సమాధానం గా మహేష్ మీరు నన్ను కొట్టి మాట్లాడొచ్చు అంటూ చెప్పుకొచ్చారట. ఈ విషయం కూడా రామేశ్వరి చెప్పుకొచ్చారు.

Also Read : Niharika: ఐదేళ్ల వయసులోనే నా మొగుడని ఫిక్స్ అయ్యా.. మహేష్ బాబుపై నిహారిక కామెంట్స్..!

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×