Allu Arjun : ‘పుష్ప 2’ (Pushpa 2) తీసుకొచ్చిన వివాదాల నుంచి అల్లు అర్జున్ (Allu Arjun) బయట పడ్డాడు. ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోయిన బన్నీ, సక్సెస్ మీట్ పెట్టి, ‘పుష్ప 2’ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ప్రస్తుతం ఆయన నెక్స్ట్ మూవీపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందులో భాగంగా బన్నీ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అయిందని వార్తలు విన్పిస్తున్నాయి.
రామ్ చరణ్ హీరోయిన్ తో రొమాన్స్
‘పుష్ప 2’ విజయం తర్వాత అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) తో కలిసి కొత్త మూవీని స్టార్ట్ చేయనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో బన్నీ అట్లీ(Atlee)తో నెక్స్ట్ సినిమాను ప్రారంభించే అవకాశం ఉంది. బన్నీ – అట్లీ కాంబోలో హై-ఆక్టేన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. అల్లు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించనుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ఇప్పటికే ‘ఆర్సీ 16’లో భాగమైన ఈ అమ్మడు, ఇప్పుడు బన్నీతో రొమాన్స్ చేయనుంది అనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాన్వీ కపూర్ కు వరుస అవకాశాలు
‘దేవర’ మూవీతో జాన్వి కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’లోని ‘చుట్టమల్లె చుట్టేసింది’ పాటతో బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. ప్రస్తుతం బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఆర్సీ 16’ చిత్రంలో కూడా ఆమె నటించనుంది. మరోవైపు జాన్వికి తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కూడా ఆహ్వానం అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె బన్నీ -అట్లీ కాంబోలో రాబోతున్న మరో పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.
రూమర్ కు ఇదే కారణమా ?
రీసెంట్ గా అట్లీ భార్య ప్రియతో కలిసి సరదాగా గడిపింది జాన్వి. ఈ నేపథ్యంలోనే జాన్వీ కపూర్ అట్లీ నెక్స్ట్ మూవీలో ప్రధాన పాత్ర పోషించనుందనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. నెల రోజుల క్రితం, ప్రియా పుట్టినరోజు వేడుకలో జాన్వీ పార్టీ చేసుకుంటూ కనిపించింది, అక్కడ ప్రియ చుట్టూ బాలీవుడ్ యంగ్ స్టర్స్ ఉన్నారు. ఈ వేడుకలో జాన్వి సోదరి ఖుషీ కపూర్, రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా, నటుడు వీర్ పహారియా, నటి కాజల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
మరో ఇంటరేసింగ్ వార్త ఏమిటంటే, దర్శకుడు అట్లీ మరోవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో ఒక యాక్షన్ సినిమా తీయడానికి చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఇప్పటికైతే ‘A6’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇందులో రజనీకాంత్, సల్మాన్ ఖాన్ కలిసి నటించనున్నట్లు సమాచారం.