BigTV English

Niharika: ఐదేళ్ల వయసులోనే నా మొగుడని ఫిక్స్ అయ్యా.. మహేష్ బాబుపై నిహారిక కామెంట్స్..!

Niharika: ఐదేళ్ల వయసులోనే నా మొగుడని ఫిక్స్ అయ్యా.. మహేష్ బాబుపై నిహారిక కామెంట్స్..!

Niharika..సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి.. ఆయన చూసే చూపుకి గిలగిలా కొట్టుకునే అమ్మాయిలు కోకొల్లలు.. అయితే అలాంటి మహేష్ బాబుని చిన్నప్పటినుండి చూస్తున్న ఒక నటి.. ఆయన కంటే వయసులో చాలా చిన్నది. అయినప్పటికీ ఎప్పటికీ మహేష్ బాబే నా మొగుడు అంటూ పబ్లిక్ గానే చెబుతోంది. మరి ఇంతకీ మహేష్ బాబుని అంత పిచ్చిగా ప్రేమిస్తున్న ఆ నటి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. మహేష్ బాబు అంటే మామూలు అమ్మాయిలకే కాదు హీరోయిన్లకు కూడా ఇష్టమే. మహేష్ ఆ పేరులోనే ఏదో తెలియని మ్యాజిక్ ఉంది అంటూ ఎంతో మంది హీరోయిన్లు అంటూ ఉంటారు.అయితే అలాంటి మహేష్ బాబుని ఇష్టపడే వారిలో ఈ నటి కూడా ఒకరు.


మహేష్ బాబుపై మనసు పారేసుకున్న నిహారిక..

ఆమె ఎవరంటే నిహారిక( Niharika).. ఇక నిహారిక అంటే అందరూ మెగా డాటర్ నిహారిక అనుకుంటారు.కానీ ఆమె కాదు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా నెట్టింట్లో చాలా యాక్టివ్ గా ఉండే బుల్లితెర నటి నిహారిక ఎన్ ఎమ్ (Niharika N. M) .. ‘పెరుసు’ అనే మూవీతో హీరోయిన్ గా కూడా మారింది నిహారిక. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి సోషల్ మీడియా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటంతో.. ఆ మధ్యకాలంలో చాలామంది స్టార్ హీరోలు ఈమెతో తమ సినిమాకి ప్రమోషన్స్ చేయించుకుంటున్నారు. అలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న నిహారిక.. మహేష్ బాబు, అడివి శేష్ తో కలిసి మేజర్(Major) సినిమా టైంలో ప్రమోషన్ కోసం వీడియో చేసిన సంగతి మనకు తెలిసిందే.


ఐదేళ్ల ప్రాయంలోనే ప్రేమ..

అయితే రీసెంట్గా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఛానల్లో మరోసారి మహేష్ పై తనకున్న అభిమానాన్ని చాటి చెప్పింది. నిహారిక మాట్లాడుతూ.. “నాకు మహేష్ అంటే చెప్పలేనంత ఇష్టం.నాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే బిగ్ స్క్రీన్ మీద ఆయన్ని చూసాను. మురారి(Murari) సినిమా చూసే టైమ్ లో నా వయసు చాలా తక్కువ. కానీ అప్పుడే ఫిక్స్ అయ్యాను ఆయనే నా మొగుడు అని.. అయితే ఆ ఏజ్ లో నాకు ఫీలింగ్స్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆయనో మిల్కీ మ్యాన్. ఎప్పటికీ నేను మహేష్ ని ప్రేమిస్తూనే ఉంటాను. మహేష్ బాబు ఇప్పటి వరకు ఎవరితో కూడా రీల్స్ చేయలేదు. కానీ నాతో 2 సార్లు రీల్స్ చేశారు. ఆ రీల్స్ ఇప్పటికి కూడా నా ఫోన్లో దాచాను” అంటూ మహేష్ బాబు మీద ఉన్న తన ఇష్టాన్ని చెప్పింది నిహారిక. ప్రస్తుతం నిహారిక మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారడంతో.. చాలామంది నెటిజన్స్ ఈ అమ్మాయికి మహేష్ బాబు అంటే ఎందుకంత ఇష్టమో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక నిహారిక ప్రస్తుతం టాలీవుడ్లోకి పెద్ద(Pedda) అనే టైటిల్ తో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో వైభవ్ రెడ్డి సరసన నిహారిక చేస్తోంది. ఇక ఈ మూవీ సమ్మర్లో రిలీజ్ కానుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×