Actress Renu Desai:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)సరసన పలు చిత్రాలలో నటించి మంచి పేరు దక్కించుకుంది రేణూ దేశాయ్ (Renu Desai). ఇక ఆయనతోనే సహజీవనం చేసి అకీరా నందన్ కు జన్మనిచ్చింది. కొడుకు సమక్షంలోనే వివాహం చేసుకున్నారు ఈ జంట. ఆ తర్వాత ఆధ్యా అనే అమ్మాయి పుట్టింది. ఇక బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని ఏళ్లకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. భర్త దూరమైన తర్వాత రేణూ దేశాయ్ తన పిల్లలను తీసుకొని, ముంబైకి వెళ్ళిపోయింది. అక్కడే పిల్లలకు సంబంధించిన బాధ్యతలను చేపట్టింది. అంతేకాదు ఆధ్యా, అకీరా ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే పిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్తూ.. అవి కూడా షేర్ చేస్తూ ఉంటుంది.
రేణూ దేశాయ్ కి మాతృవియోగం..
ఇదిలా ఉండగా తాజాగా రేణూ దేశాయ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏమైంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండగా..తాజాగా రేణూదేశాయ్ తల్లి పరమపదించారు. ఈ విషయాన్ని రేణూ దేశాయ్ సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని పంచుకుంది.తన తల్లి పాత ఫోటోని షేర్ చేస్తూ.. “ప్రశాంతంగా ఉండు అమ్మా .! ఓం శాంతి.. పుట్టిన వారు మరణించక తప్పదు.. మరణించిన వారు మళ్ళీ పుట్టక తప్పదు..” అంటూ అర్థం వచ్చేలా కొటేషన్ కూడా షేర్ చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. రేణూ దేశాయ్ మాతృవియోగంతో అందరూ కంటతడి పెట్టుకుంటున్నారు. ఇక ఇలాంటి సమయంలోనే ఆమె ధైర్యంగా ఉండాలి అని.. రేణు దేశాయ్ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు కోరుతున్నారు.
రేణూ దేశాయ్ కెరియర్..
రేణూ దేశాయ్ విషయానికి వస్తే.. హీరోయిన్ గానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గా మోడల్ గా కూడా పనిచేసింది. ఈమె మహారాష్ట్రలోని పూణేలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో జన్మించి, 2000 లో వచ్చిన జేమ్స్ పాండు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించింది రేణూ దేశాయ్. ఇకపోతే ఇన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రేణూ దేశాయ్ ఇటీవల రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో కీలక పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకుంది. రీఎంట్రీలో కూడా తన నటనలో ఏ మాత్రం మార్పు రాలేదని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తన క్యారెక్టర్ కు తగ్గట్టుగా పాత్ర వస్తే కచ్చితంగా చేస్తానని, పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆ సినిమాలో నటిస్తానని చెబుతోంది రేణు దేశాయ్. ఇకపోతే ప్రస్తుతం ఈమె కొడుకు అకీరానందన్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నా.. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం హీరోగా రావాలని కోరుకుంటున్నారు. మరి తనకు ఇష్టమైన సంగీత ప్రపంచంలోకి అడుగు పెడతారా..? లేక తండ్రి అభిమానుల కోసం హీరోగా వస్తారా అనే విషయం చూడాల్సి ఉంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">