Thandel First Single: ఈరోజుల్లో సినిమాల ప్రమోషన్స్ విషయంలో మ్యూజిక్, సాంగ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముందుగా సినిమా నుండి ఒక పాట విడుదల అవ్వగానే దానికి వచ్చే రీచ్‌ను బట్టి సినిమా కూడా ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్ అవ్వగలదో డిసైడ్ అయిపోతుంది. ఇక తాజాగా నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ నుండి మొదటి లవ్ సాంగ్ విడుదలయ్యింది. బుజ్జి తల్లి అంటూ సాగే ఈ పాట.. తమ లవర్స్‌ను బుజ్జిగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక ఈ లవ్ సాంగ్‌కు ప్రేక్షకులంతా ఫిదా అయిపోతుండగా.. ఇందులో నాగచైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీనే హైలెట్‌గా నిలిచింది. దీంతో ‘తండేల్’పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు
నాగచైతన్య (Naga Chaitanya), చందూ మోండేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘తండేల్’పై మొదటి నుండి ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్జే ఉంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షనే ఓ రేంజ్‌లో స్టార్ట్ చేయడంతో అప్పటినుండి దీని గురించి తరచుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే అసలు ‘తండేల్’ ఎప్పుడెప్పుడు థియేటర్లలో విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇటీవల ఒక భారీ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసి ‘తండేల్’ విడుదల తేదీని అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఫిబ్రవరీ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని అనౌన్స్ చేసింది. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పుడే దీని మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయిపోయాయి.
Also Read: సాయి పల్లవికి సపోర్ట్‌గా చిన్మయి.. సక్సెస్‌లో ఆమెకు చోటు లేదా అంటూ ఫైర్
ఆకట్టుకుంటున్న జంట
‘తండేల్’ (Thandel) సినిమా నుండి ముందుగా ఒక గ్లింప్స్ విడుదలయ్యింది. ఆ గ్లింప్స్ చివర్లో నాగచైతన్య.. సాయి పల్లవిని బుజ్జి తల్లి అని పిలుస్తాడు. అప్పటినుండి ఆ బుజ్జి తల్లి అనే డైలాగ్, అక్కడ వచ్చే మ్యూజిక్, సాయి పల్లవి అందం.. ప్రేక్షకుల మనసుల్లో ఫిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఆ బుజ్జి తల్లి అనే పదంతోనే పాట విడుదల అవుతుంది అని తెలియగానే యూత్ అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక వారి అంచనాలకు తగినట్టుగా పాట చాలా స్లోగా, స్వీట్‌గా సాగిపోయింది. ముఖ్యంగా ఇందులో ప్రేమికులుగా సాయి పల్లవి, నాగచైతన్య పెయిర్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. విజువల్స్ కూడా ఇందులో మెయిన్ ప్లస్‌గా నిలిచాయి.
అవన్నీ ప్లస్
మాస్ మాత్రమే కాదు.. క్లాస్ మ్యూజిక్‌ను కంపోజ్ చేయడంలో కూడా దేవీ శ్రీ ప్రసాద్‌కు సెపరేట్ స్టైల్ ఉంది. ఇక ‘తండేల్’లో ఇంత మంచి లవ్ సాంగ్‌ను అందించినందుకు మ్యూజిక్ లవర్స్ అంతా దేవీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. శ్రీమణి రాసిన లిరిక్స్.. బుజ్జి తల్లి పాటకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. ఇద్దరు మనుషులు దూరంగా ఉన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ లిరిక్స్‌లో అందంగా వివరించారు. బుజ్జి తల్లి పాటలో మరొక హైలెట్‌గా నిలిచిన విషయం జావేద్ అలీ వాయిస్. ఇప్పటికే ‘లవ్ స్టోరీ’ మూవీతో ఆకట్టుకున్న సాయి పల్లవి (Sai Pallavi), నాగచైతన్య పెయిర్.. ఇప్పుడు ‘తండేల్’తో మరోసారి మ్యాజిక్ చేయనుంది.