Nizamabad Old Man: ముసలోడే కానీ మహానుభావుడనే మాటకు కరెక్ట్ వ్యక్తి ఈయన. ఈయన లుక్ చూసి, మోసపోవద్దు సుమా.. ఈయనలో విషయం ఉంది. వయస్సు పైబడ్డా, ఈయనకు ఉన్న బలం అంతా ఇంతా కాదు. ఒంటి చేత్తో ఇనుప రాడ్డును కూడా ఇలా వంచేస్తారు ఈయన. మరి ఈ వ్యక్తి రోజుకు.. అన్నం, మాంసం లాగించేస్తున్నారని మాత్రం అనుకోవద్దు. ఇంతకు ఈయన అసలు స్టోరీ తెలిస్తే ఔరా అనేస్తారు.
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం కోలీప్యాక్ గ్రామానికి చెందిన ఈ వృద్ధుడి పేరు జంగారావు. ఈయన ప్రస్తుత వయసు అక్షరాల 80 ఏళ్లు. కానీ ఈయన టాలెంట్ అంతా ఇంతా కాదు. సాధారణంగా 80 ఏళ్ల వయస్సు లో చేతిలో కర్ర, వంగిన నడుముతో వృద్ధులు మనకు కనిపిస్తుంటారు. ఈయన అందుకు భిన్నం. ఇప్పటికీ నేను నడిపే బండి రాయల్ ఫీల్డ్ అంటూ.. తన బైక్ పై రోజుకు 100 కిలోమీటర్లు రైడింగ్ చేస్తారు.
ఈయన స్పెషాలిటీ తెలుసుకుంటే నోరెళ్ల బెట్టాల్సిందే. 80 ఏళ్లు గల జంగారావు 50 ఏళ్లుగా అస్సలు అన్నమే తినరట. 30 ఏళ్ల వయస్సు లోనే అన్నానికి స్వస్తి పలికి, కేవలం పండ్లు ఫలహారాలు మాత్రమే భుజిస్తారు జంగారావు. అది కూడా వారానికి రెండు, మూడు రోజులు మాత్రమేనట. అందుకే తాను ఇప్పటికీ యువకులకు పోటీనిచ్చే బలాన్ని కలిగి ఉన్నట్లు జంగారావు తెలుపుతారు.
తన ఆరోగ్య రహస్యంపై బిగ్ టీవీతో జంగారావు మాట్లాడుతూ.. తనకు ఇప్పుడు 80 ఏళ్ల వయస్సు ఉందని, 50 ఏళ్లుగా తాను కేవలం పండ్లు మాత్రమే తింటూ జీవనం సాగిస్తున్నానన్నారు. రోజువారీగా తినే అన్నం కంటే, పండ్లు ఫలహారాలలోనే శక్తినిచ్చే సామర్థ్యం ఉంటుందని, అందుకే తాను ఈ అలవాటును అలవర్చుకున్నట్లు తెలిపారు.
80 ఏళ్ల వయస్సులో కూడా జంగారావు, బైక్ పై చక్కర్లు కొట్టడం, తన పనులు తానే స్వయంగా చేసుకోవడంతో ఆ గ్రామంలో జంగారావు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎంతైనా విటమిన్స్ ఉండే ఫలాలను భుజించే జంగారావు.. నేటి యువతకు కూడా ఆదర్శమే. స్ట్రీట్ ఫుడ్ కు అలవాటు పడి, యువత అనారోగ్య పాలవుతుండగా, పండ్లు తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటారో చెప్పేందుకు జంగారావే ఉదాహరణ. మరి మీరు కూడా జంగారావులా తయారు కావాలా.. అయితే ట్రై చేయండి!
అన్నం తిని 50 ఏళ్లు అయ్యింది.. అయినా ఈ వృద్ధుడు ఎంత ఫిట్ గా ఉన్నాడో చూడండి..
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం కోలిప్యాక్ కు చెందిన ఈ వృద్ధుడి పేరు జంగారావు. ఈయన వయసు 80 ఏళ్లు.
50 ఏళ్లుగా అన్నం తినలేదని, కేవలం వారానికి రెండు, మూడు రోజులు పండ్లు మాత్రమే తింటానని… pic.twitter.com/j0J2gx7riV
— BIG TV Breaking News (@bigtvtelugu) November 21, 2024