BigTV English

Actress: అర్థరాత్రి కత్తులతో బెదిరించి దోపిడీకి యత్నం… నటికి గాయాలు

Actress: అర్థరాత్రి కత్తులతో బెదిరించి దోపిడీకి యత్నం… నటికి గాయాలు

Actress : కోలీవుడ్ లో పలువురు నటీమణుల ఇంట దొంగతనం అనే వార్తలు తరచుగా విన్పిస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఒక వివాదంతో ‘ది గోట్’ మూవీలో కీలకపాత్రను పోషించిన హీరోయిన్ పార్వతి నాయర్ చిక్కుకుంది. తాజాగా మరో తమిళ నటి ఇంట్లోకి అర్దరాత్రి ప్రవేశించిన కొందరు దుండగులు కత్తితో చోరీకి యత్నించిన ఘటన కలకలం రేపింది.


నటి ఇంట్లో చోరికి యత్నం 

తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి, హాట్ బ్యూటీ సోనా ఇంట్లో తాజాగా దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు అనే వార్త ఆమె అభిమానులను ఆందోళనకు గురి చేసింది. షాజహాన్, జితన్, కుసేలన్ వంటి పలు చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించిన ఈ నటి చెన్నైలోని మధురవాయల్‌లో ఉన్న కృష్ణానగర్‌లోని 28వ వీధిలో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి ఇద్దరు ఆగంతకులు ఆమె ఇంటి కాంపౌండ్ గోడపై నుండి దూకి, ఇంటి బయట అమర్చిన ఏసీ యూనిట్‌ను దొంగిలించడానికి ప్రయత్నించారని సమాచారం. అది చూసిన సోనా కుక్క వారిపై మొరిగిందట. కుక్క అరుపులు విని బయటకు సోనా బయటకు రావడంతో ఆమెను చూసిన ఇద్దరు ఆగంతకులు మొదట అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ సోనా వారిపై కేకలు వేయడంతో అగంతకులు కత్తితో బెదిరించారని తెలుస్తోంది. వారి నుంచి  తప్పించుకోవడానికి సోనా పారిపోయేందుకు ప్రయత్నించి కిందపడిపోవడంతో స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అనంతరం దోపిడీకి పాల్పడిన ఇద్దరు ద్విచక్ర వాహనం తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో సోనా పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న మధురవాయల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి సమీపంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని కత్తితో బెదిరించిన వ్యక్తులు ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నటి సోనా ఇంట్లోకి ప్రవేశించిన అనుమానాస్పద వ్యక్తులు కత్తితో బెదిరించిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.


పని మనిషి వివాదంలో చిక్కుకున్న పార్వతి నాయర్ 

కొన్నాళ్ళ క్రితం హీరోయిన్ పార్వతి నాయర్ ఇంట్లో 10 లక్షలు దొంగతనం జరిగిందని కేసు పెట్టగా, పోలీసులు ఆమె ఇంట్లో పని చేస్తున్న సుభాస్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే అప్పటిదాకా బాగానే ఉన్న ఆ వ్యక్తి సుభాష్ హీరోయిన్ పార్వతి నాయర్ తనను కులం పేరుతో దూషించిందని, తప్ప తాగి తన ఫ్రెండ్స్ తో కలిసి తనను బంధించి, కొట్టిందని తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలిస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. తాజాగా ఈ వివాదంపై స్పందించిన పార్వతి నాయర్ ఆ వ్యక్తి దొంగతనం చేశాడని, గత రెండేళ్ల నుంచి తనను వేధిస్తున్నాడని, రెండేళ్ల నుంచి తనను వేధిస్తున్నాడు అంటూ ఓ సుధీర్ఘ నోట్ ను రిలీజ్ చేసింది. అంతేకాకుండా అతని వేధింపుల వల్ల మానసిక వేదన అనుభవిస్తున్నా అంటూ ఆవేదనను వ్యక్తం చేసింది. అంతలోనే సోనా ఇంట్లో దొంగతనం జరిగింది అనే వార్త బయటకు వచ్చింది.

 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×