BigTV English

Roja Birthday Special  : టాలీవుడ్ అందాల రోజా పువ్వుకి పుట్టినరోజు శుభాకాంక్షలు..

Roja Birthday Special  : టాలీవుడ్ అందాల రోజా పువ్వుకి పుట్టినరోజు శుభాకాంక్షలు..

Roja Birthday Special : అటు సినిమాలలో ఇటు రాజకీయాలలో తనదైన శైలితో.. ఇలాంటి పరిస్థితుల్లో అయినా చక్కటి చిరునవ్వుతో.. ముందుకు వెళ్తున్న వ్యక్తి.. సీనియర్ నటి..ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖమంత్రి శ్రీమతి రోజా. వెండితెరపై ఎన్నో చిత్రాలలో తన అందం అభినయంతో శ్రీగంధాలు పూయించిన అభినయ తార రోజా. బుల్లితెరపై పలు రకాల రియాలిటీ షోస్ లో చురుకుగా పాల్గొని.. తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది.ఇక రాష్ట్ర రాజకీయాలలో కూడా మహిళల సత్తా చాటుతూ దూసుకు వెళ్తోంది రోజా.


టాలీవుడ్ లో అందరికీ సుపరిచితమైన రోజా అసలు పేరు శ్రీ లతా రెడ్డి. నవంబర్ 17, 1972 లో ఆమె తిరుపతిలో జన్మించారు. పద్మావతి యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన రోజా.. తర్వాత హైదరాబాద్ కు చేరుకున్నారు. డాక్టర్ శివప్రసాద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ప్రేమ తపస్సు’ చిత్రంతో రోజా సినీ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశారు. అయితే తమిళ్ లో ఆర్.కె.సెల్వమణి డైరెక్షన్ లో రోజా నటించిన ‘చెంబరుతి’ మూవీ తో మంచి సక్సెస్ సాధించారు. ఇదే మూవీ తెలుగులో చామంతి అనే పేరుతో విడుదలైంది.ఆ తర్వాత సర్పయాగం, సీతారత్నంగారి అబ్బాయి, ముఠా మేస్త్రీ, పోలీస్ బ్రదర్స్, అన్న, శుభలగ్నం, ముగ్గురు మొనగాళ్ళు, ఘటోత్కచుడు,బొబ్బిలిసింహం, శ్రీకృష్ణార్జున విజయం, పెద్దన్నయ్య, సుల్తాన్” లాంటి పలు చిత్రాలలో నటించారు. బాలకృష్ణ తో రోజా చేసిన భైరవద్వీపం మూవీ లో రాజకుమార్ దిగా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్ షో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ తనదైన బాణీ తో కార్యక్రమాన్ని సూపర్ డూపర్ హిట్ చేస్తున్నారు. ‘బతుకు జట్కా బండి’ షో లో అందరి సమస్యల విని రోజా అభాగ్యులకు న్యాయం చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు.1999 లో రోజా తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 2009 లో చంద్రగిరి నుండి పోటీ చేసి ఓడిపోయిన రోజా ఆ తర్వాత కొంతకాలానికి వైసీపీలో చేరారు. 2014 ,2019 ఎలక్షన్స్ లో రెండు సార్లు వరుసగా వైసీపీ తరఫున నగిరి నుంచి గెలుపొందారు. ఇప్పుడు ఏపీ స్టేట్ మినిస్టర్ గా కొనసాగుతున్నారు.


అన్ని రంగాలలో రాణిస్తున్న రోజా కు బిగ్ టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×