BigTV English

Samantha: ఒంటరితనం భరించలేకున్నా.. సామ్ మాటలకు అర్థం ఏమిటి..?

Samantha: ఒంటరితనం భరించలేకున్నా.. సామ్ మాటలకు అర్థం ఏమిటి..?

Samantha: 2010లో గౌతమ్ మీనన్ (Gautam Menon )దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏ మాయ చేసావే’ ( Ye maaya chesave ) సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది సమంత (Samantha). మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటన కనబరిచి ఉత్తమ నూతన నటి విభాగంలో ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు (Maheshbabu) ‘దూకుడు’ సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. అలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, బృందావనం, రంగస్థలం, ఆ ఆ వంటి చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది సమంత. ఇక మధ్యలో అడపాదడపా సినిమాలు బెడిసికొట్టినా ఈమె చాలామంది స్టార్ హీరోలు సరసన నటించి పాపులారిటీ దక్కించుకుంది.


భర్త నుంచి దూరమయ్యాక ఒంటరితనం ఎక్కువైంది..

సమంత వ్యక్తిగత విషయానికి వస్తే.. తొలి సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్య (Naga Chaitanya) తో ప్రేమలో పడి, 2017 లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. వివాహం జరిగిన తర్వాత ‘మజిలీ’ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సమంత, ఆ తర్వాత అనూహ్యంగా 2021లో భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. వివాహం తర్వాత ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్న సమంత, ఆ తర్వాత మయోసైటిస్ అనే అనారోగ్య బారిన కూడా పడింది. ఈ సమస్య నుంచి తేరుకోవడానికి దాదాపు ఏడాది పాటు ఇండస్ట్రీకి కూడా దూరమయింది. ఒకవైపు భర్తకు దూరంగా, మరొకవైపు అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టడంతో ఒంటరితనం వెంటాడింది.


ఇకపై ఐటెం సాంగ్స్ చెయ్యను..

ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలలోకి రీ యంట్రీ ఇచ్చిన ఈమె అందులో భాగంగానే..’సిటాడెల్ – హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ జోరుగా చేపట్టిన సమంత ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ఇంటర్వ్యూలో భాగంగా..” ఇకపై మీరు ఐటెం సాంగ్స్ చేస్తారా?” అని అడిగితే.. “ఐటెం సాంగ్స్ చెయ్యను” అంటూ క్లారిటీ ఇచ్చింది సమంత. అసలు విషయంలోకెళితే.. ఇదివరకే అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప (Pushpa) సినిమాలో ఐటెం సాంగ్ చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పుడు పుష్ప -2 (Pushpa -2)లో కూడా ఐటమ్ సాంగ్ చేస్తోంది అంటూ ఒక వార్త రావడంతోనే ఇలాంటి ప్రశ్న ఎదురయింది. దీంతో సమంత..” అవన్నీ పుకార్లే” అంటూ క్లారిటీ ఇచ్చింది.

మింగిల్ అవ్వడానికి సిద్ధం..

“మీరు ఒంటరిగానే ఉండాలని అనుకుంటున్నారా..? అని ప్రశ్నించగా.. దానికి సమంత ..”ఒంటరితనాన్ని భరించాలని అనుకోవట్లేదు” అంటూ సమాధానం చెప్పింది. దీన్నిబట్టి చూస్తే సమంత త్వరలోనే మింగిల్ అవ్వడానికి సిద్ధంగా ఉందేమో అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఒంటరిగానే జీవిస్తోంది. అటు మయోసైటిస్ సమస్య వచ్చినప్పుడు కూడా ఆ ఒంటరితనాన్ని ఆమె ఎంతో ఫీలయ్యింది. ఇక ఆ బాధ నుంచి బయటపడడానికే విదేశాలకు వెళ్తూ.. పలు వెకేషన్స్ లో ఎంజాయ్ చేసింది. అందుకే తనకంటూ ఒక తోడు కావాలని కోరుకుంటోందేమో అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×