BigTV English
Advertisement

Cruise Tour: నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం, టూర్ విశేషాలు, టికెట్ ధరలు ఇవే!

Cruise Tour: నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం, టూర్ విశేషాలు, టికెట్ ధరలు ఇవే!

Boat Ride From Nagarjuna Sagar To Srisailam: నాగార్జునసాగర్ లో సరిపడ నీళ్లు లేని కారణంగా సుమారు ఐదు సంవత్సరాలుగా లాంచీ ప్రయాణం నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మళ్లీ ప్రారంభించింది. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ఎంతగానో ఇష్టపడే నాగార్జున సాగర్- శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని కార్తికమాసం తొలి రోజైన శనివారం నాడు టూరిజం అధికారులు ప్రారంభించారు. గత కొద్ది కాలంగా ఎగువ రాష్ట్రాల్లో పుష్కలంగా వర్షాలు కురవడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్నది. లాంచీ ప్రయాణానికి సరిపడ నీటి మట్టం ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక సంస్థ లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించింది. సుమారు 120 కి.మీ దూరం ఉండే ఈ ప్రయాణానికి తొలి రోజు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు.


లాంచీ ప్రయాణం ఎలా కొనసాగుతుందంటే?

నాగార్జున సాగర్ నుంచి మొదలయ్యే ఈ లాంచీ ప్రయాణం నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాంత అందాలను తిలకించేలా ముందుకుసాగుతుంది. మరోవైపు నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను కూడా తెలంగాణ పర్యాటక సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొల్లాపూర్ మండలం సోమశిల తీరంలో 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు తాజాగా ప్రారంభించారు. అక్కడి నుంచి శ్రీశైలం వరకు 120 కిలో మీటర్ల మేర 7 గంటల పాటు ఈ ప్రయాణం కొనసాగుతోంది.


టికెట్ రేట్లు ఎంత అంటే?

ఇక ఈ లాంచీ ప్రయాణానికి సంబంధంచి తెలంగాణ పర్యాటక సంస్థ టూర్ టికెట్ ను ఫిక్స్ చేసింది. సుమారు 120 కిలో మీటర్ల మేర కొనసాగే ఈ లాంచీ ప్రయాణానికి కి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600గా టికెట్‌ ధరలు పెట్టారు. నాగార్జునసాగర్‌ డ్యాంలో నీటి మట్టం 575 అడుగులు ఉన్నంత వరకు ఈ లాంచీ ప్రయాణం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి శ్రీశైలానికి లాంచీలు నడపనున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్ నుంచి స్పెషల్ ప్యాకేజీ

అటు ఈ లాంచీ ప్రయాణం చేయాలనుకునే పర్యాటకుల కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది పర్యాటక సంస్థ. హైదరాబాద్ నుంచి సోమశిల, శ్రీశైలం వరకు టూర్ సర్వీసులను కూడా టూరిజం కార్పొరేషన్ ప్రారంభించింది. ఈ టూర్ హైదరాబాద్ నుంచి ప్రతి శనివారం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రయాణం శనివారం నాడు సికింద్రాబాద్, బేగంపేట్, బషీర్‌బాగ్ నుంచి మధ్యాహ్నం 1:30, 2:00 గంటల మధ్య ప్రారంభం అవుతుంది. నాన్ ఏసీ హైటెక్ కోచ్ ద్వారా టూరిస్టులు ఎసి హైటెక్ కోచ్ ద్వారా రాత్రి 7.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుంటారు. రాత్రిపూట నాన్-ఎసి లేదంటే డార్మిటరీ వసతి గృహాలలో బస చేస్తారు. మరుసటి రోజు శ్రీశైలం దేవాలయం, సాక్షి గణపతి దేవాలయం, శ్రీశైలం డ్యామ్ దగ్గరికి తీసుకెళ్తారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత, హైదరాబాద్ పర్యాటకులు నాగార్జునసాగర్‌కి లాంచీలో బయల్దేరుతారు. బోటులోనే భోజనాలు చేస్తారు. సాగర్ కు చేరుకున్న తర్వాత, అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్ కు బయల్దేరుతారు.

హైదరాబాద్ నుంచి రోడ్ కమ్ క్రూయిజ్ టూర్ ధరలు

హైదరాబాద్ నుంచి రోడ్ కమ్ క్రూయిజ్ టూర్ కోసం పెద్దలకు రూ. 3,050గా, పిల్లలకు రూ. 2,450గా నిర్ణయించారు. రవాణా, లంచ్, టీ, వసతి సౌకర్యాలు అన్నీ ఇందులోనే కవర్ అవుతాయి. టూరిస్టుల రాత్రి భోజనం, బ్రేక్ ఫాస్ట్, ఆలయ దర్శనం టికెట్ ఖర్చులు టూరిస్టులు పెట్టుకోవాల్సి ఉంటుంది.

Read Also:  దేశంలో అత్యంత అందమైన రైల్వే ప్రయాణాలు.. లైఫ్ లో ఒక్కసారైనా ఈ జర్నీ చేయాల్సిందే!

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Big Stories

×