Samantha: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర తారగా ఒక వెలుగు వెలిగింది సమంత (Samantha). ఈమె మయోసైటిస్(Myositis) వ్యాధి బారిన పడి ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి బయటపడుతున్న ఈమె, మళ్లీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే సిటాడెల్ – హనీబన్నీ (Citadel Honey Bunny) వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఈమె యాక్షన్ పర్ఫామెన్స్ మాత్రమే కాదు ఊహించని సన్నివేశాలలో నటించి అందరిని అబ్బురపరిచింది సమంత.
నాటి ఇబ్బందులను గుర్తు చేసుకున్న సమంత..
ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను తన సొంత నిర్మాణ బ్యానర్లో నిర్మిస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ను వదలలేదు సమంత. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత, మరోసారి మయోసైటిస్ వ్యాధి గురించి తెలిపింది. మొదటిసారి ఆ వ్యాధి లక్షణాలు కనిపించిన రోజులను గుర్తు చేసుకుంది. సమంత మాట్లాడుతూ.. “కాఫీ విత్ కరణ్ (Coffee with Karan) షోలో పాల్గొన్నప్పుడు, శరీరం మొత్తం చాలా వీక్ గా అనిపించింది. అసలు ఓపిక లేదు. అయినా సరే ఆ టాక్ షో కంప్లీట్ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చేసాను. అయితే ఆరోజు అంత నీరసంగా ఉన్నా.. షోలో మాత్రం ప్రశాంతంగానే కనిపించాను. అయితే ప్రస్తుతం కెరియర్ పైన ఫోకస్ పెట్టాను. షో ముగిసిన మరుసటి రోజు ఖుషి(Kushi) సినిమా షూటింగ్ కి వెళ్ళాను. అప్పుడు ఎంతో ఇబ్బంది పడ్డాను. నా బాడీ మొత్తం షట్ డౌన్ అయిపోయింది. ఆ క్షణం నుంచి ఆరోగ్యం మొత్తం క్షీణించడం ప్రారంభమైంది. అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే నాకు మయోసైటిస్ వ్యాధి వచ్చిందని గుర్తించడానికి ఎంతో సమయం పట్టింది. ఆ తర్వాత కూడా నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను” అంటూ ఎమోషనల్ అయింది సమంత. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సమంత ఇబ్బందులు దగ్గరుండి చూశాం – డైరెక్టర్ రాజ్
ఇదిలా ఉండగా సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో కూడా సమంత ఎంత కష్టపడిందో ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ (Raj) వెల్లడించిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడుతూ.. ఇందులో యాక్షన్ సన్నివేషాలు చాలా కఠిన తరంగా ఉండేవి. అయితే సమంత ఆ సన్నివేశాలు చేసేటప్పుడు ఎంతో శ్రమించింది. ఒక్కోసారి ఆమె అనారోగ్య సమస్య కారణంగా కింద పడిపోయేది. ఆ క్షణం మాకు భయం వేసేది. ఆ తర్వాత కొంతసేపటికి మళ్ళీ తేరుకొని ఆమె షూటింగ్ లో పాల్గొనేది. ఆమె పడ్డ కష్టం దగ్గరుండి చూశాము కాబట్టి ఆమె నటనకు ఎంత ప్రయారిటీ ఇస్తుందో మాకు తెలుసు” అంటూ సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ తెలిపారు. మొత్తానికైతే సమంత ఈ వ్యాధి కారణంగా ఎన్నో అవస్థలు పడిందని తెలుస్తోంది.