BigTV English
Advertisement

Shakeela: హోటల్ గదిలో వేణు మాధవ్, నేను ఒకే బెడ్ మీద పడుకున్నాం- హస్కీ వాయిస్‌తో ఆయన అలా అడిగే సరికి షాకయ్యా: షకీలా

Shakeela: హోటల్ గదిలో వేణు మాధవ్, నేను ఒకే బెడ్ మీద పడుకున్నాం- హస్కీ వాయిస్‌తో ఆయన అలా అడిగే సరికి షాకయ్యా: షకీలా

Shakeela About Comedian Venu Madhav: మాజీ శృంగార తార షకీలా, దివంగత కమెడియన్ వేణు మాధవ్ మధ్య మంచి స్నేహం ఉండేది. ఈ విషయాన్ని ఇద్దరూ చాలాసార్లు చెప్పారు. వేణు మాధవ్ చనిపోక ముందు తరచుగా తనకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగేవాడని షకీల రీసెంట్ గా గుర్తు చేసుకుంది. మంచి మిత్రుడు చనిపోవడం బాధగా ఉందని చెప్పింది. కొద్ది కాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, ఇద్దరి మధ్య జరిగిన ఓ షాకింగ్ ఘటన గురించి వెల్లడించింది. అతడి మాటలు విని ఇప్పటికీ నవ్వుకుంటానని వెల్లడించింది.


హోటల్ గదిలో ఒకే బెడ్ పై షకీలా, వేణు మాధవ్

ఓ సినిమా షూటింగ్ లో భాగంగా వేణు మాధవ్ తాను ఒకే బెడ్ మీద పడుకున్నామని, అప్పుడు తనతో అన్న మాటలు విని చాలా టెన్షన్ పడ్డానని చెప్పింది. “వేణు నేను ఓ సినిమా షూటింగ్‌ లో పాల్గొన్నాం. అక్కడ బ్రహ్మానందం, రఘుబాబుతో పాటు చాలా మంది ఉన్నారు. బయట నుంచి మమ్మల్ని చూసేందుకు చాలా మంది ప్రేక్షకులు హోటల్ కు వచ్చే వాళ్లు. ఆ టైంలో వేణు మాధవ్ నా రూంలోనే ఉన్నాడు. ఇతర కమెడియన్లు వాళ్ల రూమ్ లను నీట్ గా ఉంచుకునే వాళ్లు. నా రూమ్ మాత్రం దరిద్రంగా తయారు చేసే వాళ్లు. ఫుడ్ తిని అక్కడే పడేసే వాళ్లు. నా రూమ్ నీట్ గా లేకపోవడంతో వేణు నీ రూపంలో పడుకుంటానన్నాను. సరే రా అన్నాడు. ఇద్దరం కలిసి ఒకే బెడ్ మీద పడుకున్నాం. కాసేపటి తర్వాత టీవీ అద్దం మీద ఏదో డిస్టబెన్స్ అనిపిస్తున్నది. అప్పుడు వేణు మాధవ్ నీతో ఒకమాట అడగనా? ఒప్పుకుంటావా? అన్నాడు.


ఫ్రెండ్ అని వచ్చానే? ఇప్పుడే ఏదైనా తప్పుగా అడిగితే ఇన్ని రోజుల ఫ్రెండ్షిప్ ఉండదు. సరే అడిగి చావు అన్నాను. ఒప్పుకోను అని చెప్పకూడదని హస్కీ వాయిస్ తో చెప్తున్నాడు. గదిలో లైట్ ఆఫ్ చేసి ఉన్నాయి. ఏంట్రా నీ ప్రాబ్లమ్.. చెప్పురా అన్నాను. అప్పుడు తను మా ఇద్దరి మధ్యలో పిల్లోస్ పెడుతున్నాను. ఏంట్రా ఇది అన్నా. “ఏం లేదు.. నాకు పెళ్లై ఇద్దరు బిడ్డలు ఉన్నారు. వాళ్లు బాగుండాలంటే నేను బతికి ఉండాలి. నువ్ పడుకొని ఆ కాళ్లు నా మీద వస్తే చస్తానని భయపడి ఈ దిండ్లు పెడుతున్నాను. నువ్ కాళ్లు వేయాలనుకుంటే ఈ దిండ్లపై వేసుకో” అన్నాడు. దానికి నేను నైట్ అంతా నవ్వాను. తర్వాత రోజు ఈ విషయం బ్రహ్మానందం, రఘు అందరికీ చెప్పేశా. ఇది కదా ఫ్రెండ్ షిప్ అంటే.. నేను తప్పుగా అనుకున్నానని బాధపడ్డాను” అంటూ వేణు మాధవ్ గురించి చెప్పుకొచ్చింది షకీలా. అలాంటి వ్యక్తి లేకపోవడం నిజంగా బాధాకరం అన్నది.

Also Read: మర్మాంగాలపై తన్ని, షాకిచ్చి.. తలను ఛిద్రం చేసి.. రేణుకాస్వామి ఛార్జిషీట్‌లో షాకింగ్ విషయాలు

షకీలా మూవీ విడుదల అవుతుందటే స్టార్ హీరోల సినిమాలు సైతం వాయిదా

షకీలా గురించి తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తన శృంగారభరిత సినిమాలతో సుమారు రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోలకు మించి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. ఒకానొక సమయంలో షకీలా సినిమా విడుదల అవుతుందంటే, స్టార్ హీరోలు సైతం తమ సినిమాల రిలీజ్ ను వాయిదా వేసుకునే వాళ్లు. అంతటి క్రేజ్ సంపాదించుకున్నది షకీలా. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×