BigTV English

Bigg Boss 8 Telugu Promo: మరీ ఇలా ఉన్నారేంట్రా, తిండి కోసం మరీ ఇలా దిగజారిపోతారా? మీకంటే దొంగలే నయం!

Bigg Boss 8 Telugu Promo: మరీ ఇలా ఉన్నారేంట్రా, తిండి కోసం మరీ ఇలా దిగజారిపోతారా? మీకంటే దొంగలే నయం!

Bigg Boss 8 Telugu Latest Promo: మామూలుగా ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో రేషన్‌తో పాటు కంటెస్టెంట్స్‌కు లగ్జరీ బడ్జెట్ అనేది కూడా అందించేవారు బిగ్ బాస్. అంటే బియ్యం, పప్పులు లాంటివి కాకుండా మరింత రుచికరమైన భోజనం తినాలన్నా, కంటెస్టెంట్స్‌కు నచ్చిన ఆహారం రావాలన్నా లగ్జరీ బడ్జెట్ టాస్కులు ఆడాల్సిందే. కానీ బిగ్ బాస్ 8లో అలా కాదు. బియ్యం, పప్పులు కోసం కూడా కంటెస్టెంట్స్ పోటీపడాలి. వారు టాస్కులు ఆడి గెలిచినవి మాత్రమే తినాలి. దీంతో బిగ్ బాస్ హౌజ్‌లో తిండి కష్టాలు మొదలయ్యాయి. ఆకలి తట్టుకోలేని కొందరు హౌజ్‌మేట్స్ దొంగల్లాగా మారారు.


అన్నీ చోరీ

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8లో యష్మీ, నైనికా, నిఖిల్ టీమ్స్ మధ్య రేషన్ కోసం పోటీ మొదలయ్యిందని తాజాగా విడుదలయిన ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. అయితే అలా సాధించిన రేషన్‌ను కూడా దొంగతనం చేయాలని చూస్తున్నారు హౌజ్‌మేట్స్. ముందుగా యష్మీ దొంగతనం చేయడం ప్రారంభించింది. ఉన్న రేషన్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలని సోనియా, యష్మీ మధ్య డిస్కషన్ మొదలయ్యింది. అదంతా వింటున్న అభయ్ మాత్రం.. ‘‘చీఫ్ ఏం చెప్తే అది చేయడం తప్పా మన చేతుల్లో ఏం లేదు’’ అని లైట్ తీసుకున్నాడు. ప్రేరణ కిచెన్‌లో వంట చేస్తుండగానే ఎవరికీ తెలియకుండా టీ పౌడర్, చక్కెరను సగం తీసి తమ బెడ్‌రూమ్‌లో దాచిపెట్టింది యష్మీ. నైనికా కూడా తనకు దొరికిన ఆహారాన్ని తీసుకొని దాచిపెట్టుకుంది.


Also Read: యష్మీపై మణికంఠ ఫైర్, మరోసారి సోనియా మొసలి కన్నీళ్లు.. బిగ్ బాస్‌లో ఫుడ్ దొరకడం ఇంత కష్టమా?

దిష్టి తగలకూడదు

అన్ని గమనించిన నాగ మణికంఠ.. ఈ విషయాన్ని తన చీఫ్ నిఖిల్‌కు చెప్పాడు. ‘‘వాళ్ల దగ్గర ఉన్న జ్యూస్ బాటిల్స్ దొబ్బేద్దాం. ఎందుకు దొబ్బేయకూడదు?’’ అని ఫిక్స్ అయ్యాడు. అప్పుడే నబీల్ వచ్చి ఇతర టీమ్‌మేట్స్ వారి చికెన్‌ను దొంగలించారని చెప్పాడు. ‘‘ఇంత ఘోరంగా ఉంటే నేను కూడా దొంగలిస్తా’’ అని చెప్పగానే మణికంఠ చేయమని ఎంకరేజ్ చేశాడు. ‘‘ఎవరైతే దొంగలించారో వాళ్లకు అరగొద్దు దేవుడా’’ అంటూ శాపం పెట్టింది సీత. ఆ తర్వాత విష్ణుప్రియా వెళ్లి కిచెన్‌లో నుండి జ్యూస్ బాటిల్ తెచ్చుకుంది. అందరి ముందు దానిని తీసుకెళ్తూనే ఎవరి దిష్టి తగలకూడదని కోరుకుంది. నైనికా, యష్మీకి తమ టీమ్‌మేట్స్ సాయంగా ఉన్నారు. కానీ నిఖిల్ టీమ్‌లో మాత్రం నాగ మణికంఠ ఒక్కడే ఉన్నాడు.

రక్తం తాగుతున్నావు

నిఖిల్, నాగ మణికంఠ.. వారికి దక్కాల్సిన రేషన్ కోసం హౌజ్ మొత్తంతో పోటీపడ్డారు. రెండురోజులు రేషన్ కోసం టాస్కులు ఆడడం వల్ల నాగ మణికంఠ అలసిపోయానని నిఖిల్‌తో చెప్పాడు. ‘‘నా జీవం తింటున్నావు కదరా. నీ వల్ల 5 కిలోలు తగ్గాను. కూర్చొని నా రక్తం తాగుతున్నావు’’ అని కామెడీ చేశాడు నిఖిల్. కూర్చున్న చోటే పడిపోయిన మణికంఠ.. ‘‘నీరసంగా ఉంది మొహం మీద జ్యూస్ చల్లండి’’ అన్నాడు. నిఖిల్, మణికంఠ కలిసి ఎంత యాక్టివ్‌గా టాస్కులు ఆడినా హౌజ్ మొత్తంతో ఇద్దరే పోటీపడాల్సిన పరిస్థితి రావడంతో రేషన్ విషయంలో వారికి న్యాయం జరగలేదని తాజాగా విడుదలయిన ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×