Actress : హీరోయిన్లు ఎప్పటికప్పుడు ప్రాపర్టీలు కొంటూ వార్తల్లో నిలుస్తారు. కానీ కొన్నిసార్లు మాత్రం విచిత్రమైన రూమర్లు వలన ఇబ్బంది పడతారు. ఎంతో కష్టపడి కొనుక్కున్న ఆస్తిని ఎవరో ఒకరు గిఫ్ట్ గా ఇచ్చారు అంటూ రూమర్లు వెల్లు వెత్తుతాయి. అయితే తాజాగా ఓ హీరోయిన్ పై కూడా ఇలాంటి రూమరే ఉంది. ఏకంగా ఓ దర్శకుడు సదరు స్టార్ హీరోయిన్ కి 600 కోట్ల ఆస్తిని రాసిస్తానని చెప్పారట. కానీ ఆ హీరోయిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలిస్తే బుర్ర తిరగాల్సిందే. అసలు ఆ హీరోయిన్, డైరెక్టర్ ఎవరో తెలుసుకుందాం పదండి.
హీరోయిన్ కి 600 కోట్ల ఆస్తి రాసిస్తానన్న డైరెక్టర్
1998లో ‘దిల్ సే’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన హిందీ హీరోయిన్ ప్రీతి జింటా. ఆ తరువాత తారా జువ్వలా రివ్వుమని దూసుకెళ్లింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారడం మాత్రమే కాకుండా అండర్ వరల్డ్ డాన్ తో రిలేషన్ కారణంగా ఈ నటి చిక్కుల్లో పడింది. ఆ తరువాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. అయితే ఈ బ్యూటీ గురించి ఒక షాకింగ్ రూమర్ ఉంది. ప్రముఖ దివంగత దర్శకుడు కమల్ అమ్రోహి కుమారుడు షాందర్ అమ్రోహి ఈ హీరోయిన్ ను తన సొంత కూతురిలా చూసుకున్నాడని, ఒకసారి అతను తన రూ.600 కోట్ల విలువైన ఆస్తిని ప్రీతి జింటాకు బదిలీ చేయాలనుకున్నాడనే పుకార్లు ఇప్పటికీ విన్పిస్తాయి. నిజానికి ఎవరైనా ఇలాంటి ఆఫర్ వస్తే ఎగిరి గంతేస్తారు. కానీ ప్రీతి ఆ ఆఫర్ ను తిరస్కరించిందని చెప్పుకుంటారు బాలీవుడ్ మూవీ లవర్స్. అయితే షాందర్ అమ్రోహి 2011లో మరణించారు. ఆ టైమ్ లో కూడా ప్రీతికి, షాందర్ వారసులకు మధ్య ఆస్తి గురించి వివాదం నడిచింది అంటూ టాక్ నడిచింది.
అంత దిక్కుమాలిన స్తితిలో లేను
ఈ బాలీవుడ్ ‘డింపుల్ గర్ల్’కు ఆస్తి కూర్చుని తిన్నా తరగనంత ఉంది. ఆమె ఐపీఎల్ టీమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని అన్న విషయం కొందరికే తెలుసు. అయితే ఇంత ఆస్తి ఉన్నప్పటికీ షాందర్ ఆమెకు ఎందుకు ఆస్తి రాసిస్తా అన్నాడు అంటే అతను ప్రీతిని దత్తత తీసుకున్నాడు అనే సమాధానం విన్పించేది ఒకప్పుడు. కానీ తరువాత ప్రీతి ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ కుండబద్ధలు కొట్టినట్టుగా సమాధానం చెప్పింది. చిత్రనిర్మాత కమల్ అమ్రోహి పెద్ద కుమారుడు షాందర్ తనను కూతురుగా పిలుస్తారని, అయితే తనను ఎవరూ దత్తత తీసుకోలేదని, ఈ విషయంలో కథనాలు రాసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రీతీ స్వయంగా చెప్పింది. నన్ను ఎవరూ దత్తత తీసుకోలేదని లేదా నా కోసం వీలునామా రాయలేదని నేను చివరిసారిగా చెప్పాలనుకుంటున్నాను. నేను అమ్రోహికి అవసరమైనప్పుడు సహాయం చేసాను. అతను చాలా మంచి వ్యక్తి. కానీ నా జీవితంలో నాన్న స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. వేరొకరి ఆస్తి అవసరమయ్యేంత దారుణమైన స్థితిలో నేను లేను అంటూ ఆ 600 కోట్ల ఆస్తి వార్తలపై అందరి నోళ్లు మూయించింది.