Actress Shivangi:ప్రస్తుత కాలంలో అటు హీరోయిన్లు, ఇటు హీరోలు వయసుతో సంబంధం లేకుండా ప్రేమలో పడి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ప్రేమకు కళ్ళు ఉండవంటారు. కానీ ఈ హీరోయిన్ చేస్తున్న పని చూస్తే మాత్రం నిజంగా ప్రేమ గుడ్డిది అనక మానరు అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. యంగ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఒక హీరోయిన్ ఎంతో భవిష్యత్తు ఉండి కూడా 70 ఏళ్ల నటుడితో ప్రేమలో పడిందనే వార్తలు ఒక్కసారిగా ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఇక అతడితో పెళ్లికి కూడా సిద్ధం అయ్యిందంటూ వార్తలు రావడంతో ఈ విషయం కాస్త నెట్టింట వైరల్ గా మారింది అదేంటో ఇప్పుడు చూద్దాం.
70 ఏళ్ల నటుడితో హీరోయిన్ ఎఫైర్..
తాజాగా 30ఏళ్ల నటి శివంగి వర్మ(Shivangi verma), ప్రముఖ 70 ఏళ్ల నటుడు గోవింద్ నామ్ దేవ్ (Govindh naam Dev) ఫోటోని పంచుకోవడంతో అసలు వార్తలకు జోరు అందుకుంది.ఇక ఈ ఫోటోతో పాటూ “ప్రేమకు వయసు పరిమితులు లేవు” అంటూ షేర్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చింది. దీనితో ఈ పోస్ట్ వైరల్ అవ్వడమే కాకుండా ఇది చూసిన నెటిజన్లు.. అవును, ప్రేమకు కావాల్సింది వయసు కాదు.. డబ్బు. నీ తండ్రి వయస్సుతో సమానమైన వ్యక్తితో ప్రేమలో పడడానికి అసలు నీకు సిగ్గు లేదా? అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం వీరిద్దరి కాంబోలో ఒక సినిమా రాబోతోందని, ఆ సినిమా షూటింగ్లో భాగంగానే సరదాగా ఉన్న ఫోటో షేర్ చేసింది. ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది దేనికోసమైనా ఈమె షేర్ చేసిన ఫోటో, కొటేషన్ మాత్రం ఆమెపై విమర్శలు గుప్పించేలా చేస్తున్నాయి.
హీరోయిన్ పై నెటిజన్స్ ఫైర్..
ఇకపోతే శివంగి ఈ ఫోటో అలా షేర్ చేసిందో లేదో క్షణాల్లో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ఇది సినిమా ప్రమోషన్ స్టంట్ అయితే మాత్రం పర్వాలేదు. కానీ ఒకవేళ అతడితో ప్రేమ, పెళ్లి అంటే మాత్రం నీ బంగారు భవిష్యత్తు సర్వనాశనమే అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటో, కొటేషన్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు పలు అనుమానాలకు దారితీస్తోంది.
శివంగి వర్మ కెరియర్..
ఈ శివంగి వర్మ విషయానికి వస్తే.. భారతీయ నటిగా, ఎంటర్టైనర్ గా పేరు దక్కించుకున్న ఈమె హిందీ సోప్ ఒపేరాలు, టెలివిజన్ యాడ్ లలో నటిస్తూ పాపులారిటీ అందుకుంది. సోనీ పాల్ లో ప్రసారమైన టెలివిజన్ షో హమారీ సిస్టర్ దీదీ లో మెహర్ పాత్ర పోషించిన ఈమె, ఆ తర్వాత సబ్ టీవీలో బివి ఔర్ మెయిన్ లో మాయా పాత్ర పోషించి మరింత పాపులారిటీ అందుకుంది. ఇక ఈమె విద్యాభ్యాసం విషయానికి వస్తే.. 1994 ఆగస్టు 24న న్యూఢిల్లీలో జన్మించింది. అక్కడ ఆమె వసంత్ కుంజు లోని రాన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి పాఠశాల విద్యను కూడా పూర్తి చేసింది. ఇక ఇప్పుడు ఒక ఫోటో షేర్ చేయడంతోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది.