Sanju Samson: ఈ ఏడాది డిసెంబర్ 21 నుండి 2024 – 25 కి సంబంధించిన 50 ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కాబోతోంది. ఈ దేశివాలి వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్ నేపథ్యంలో కేరళ జట్టు సంజూ శాంసన్ {Sanju Samson} కి షాక్ ఇచ్చింది. కేరళ జట్టులో సంజూ శాంసన్ ఎంపిక కాలేదు. దీంతో ఇలాంటి స్టార్ ప్లేయర్ ని కేరళ జట్టు ఎందుకు తప్పించింది..? అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఏడాదిలో సంజూ {Sanju Samson} మంచి ఫామ్ లో ఉన్నాడు. ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మూడో టి-20 లోనూ సంజు శాంసన్ సెంచరీ తో చెలరేగాడు.
ఆ తరువాత సౌత్ ఆఫ్రికా పర్యటనలోనూ రెండు వరుస సెంచరీలు నమోదు చేశాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్ టీ-20 లో మూడు సెంచరీలు చేసిన మొదటి వికెట్ కీపర్ గా {Sanju Samson}నిలిచాడు. ఇదే కాకుండా టి-20 ఫార్మాట్ లో ఒకే ఏడాదిలో మూడు సెంచరీలు సాధించిన తొలి ప్లేయర్ గా రికార్డు నెలకొల్పాడు. ఇదే దేశివాలి క్రికెట్ లోని సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీకి కేరళ జట్టు కెప్టెన్ గా నియమితుడైన సంజు శాంసన్.. ఆ జట్టుకి మంచి విజయాలను అందించాడు. కానీ విజయ్ హజారే ట్రోఫీకి మాత్రం ఆ జట్టు ఇతడిని పక్కనబెట్టింది.
ఇందుకు కారణం ఏంటంటే.. అతను కేరళ జట్టు శిబిరంలో భాగం కాకపోవడమేనని సమాచారం. కేరళ జట్టు క్యాంపు లో భాగమైన 30 మంది ఆటగాళ్ల జాబితాలో శాంసన్ {Sanju Samson} పేరు కూడా ఉంది. కానీ అతడు ఈ శిబిరం నుంచి దూరంగా ఉంటున్నాడు. దీంతో హజారే ట్రోఫీకి అతడిని ఎంపిక చేయకూడదని సెలక్టర్లు నిర్ణయించుకున్నారు. ఇతడు మాత్రమే కాదు ఈ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్ లో ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా ఓపెనర్ పృథ్వి షా ని జట్టులోకి తీసుకోలేదు. ఫామ్ లేమి తో సతమతమవుతున్న ఈ కుడి చేతి బ్యాటర్ పై సెలెక్టర్లు వేటు వేశారు. అంతేకాదు 2025 ఐపీఎల్ మెగా వేలంలో 75 లక్షల కనీస ధరకే పృథ్వీషా అందుబాటులో ఉన్నప్పటికీ ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా అతని వైపు కన్నెత్తి చూడలేదు.
Also Read: Ravichandran Ashwin Retirement: క్రికెట్ కు అశ్విన్ వీడ్కోలు
ఇక ఎంతో ప్రతిభ దాగి ఉన్న సంజు శాంసన్ {Sanju Samson} తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడనే విమర్శలు కూడా ఉన్నాయి. అటు ఐపిఎల్ లో 2024లో రాజస్థాన్ రాయల్స్ జట్టును అద్భుతంగా నడిపించిన సంజు శాంసన్ ని ఆ జట్టు 2025 ఐపీఎల్ కోసం మరోసారి రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ లో 167 మ్యాచ్ లు ఆడిన సంజు.. మూడు భారీ సెంచరీలతో మొత్తం 4419 పరుగులు చేశాడు. ఇందులో 206 సిక్సులు, 352 ఫోర్లు ఉన్నాయి. కానీ అతడు విజయ్ హజారే ట్రోఫీలో ఆడే కేరళ జట్టుకు ఎంపిక కాలేదు. ట్రైనింగ్ క్యాంపులకు ఆయన హాజరు కాలేదని, ప్రాక్టీస్ మ్యాచ్ లలో ఆడిన వారినే సెలెక్ట్ చేస్తామని ఆ రాష్ట్ర క్రికెట్ బోర్డు సెక్రటరీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు.