BigTV English

Jani Master : ఎన్టీఆర్ డైరెక్టర్ పై జానీ మాస్టర్ స్పెషల్ పోస్ట్ వైరల్

Jani Master : ఎన్టీఆర్ డైరెక్టర్ పై జానీ మాస్టర్ స్పెషల్ పోస్ట్ వైరల్

Jani Master : కొన్నాళ్ల క్రితం లైంగిక ఆరోపణలతో జైలుకెళ్లిన జానీ మాస్టర్ (Jani Master) ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జానీ మాస్టర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. అందులో జానీ మాస్టర్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరితో కలిసి ఉండడం విశేషం.


బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ మాస్టర్ (Jani Master) ప్రస్తుతం మళ్లీ తన ప్రొఫెషనల్ లో బిజీ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. త్వరలోనే మంచి అప్డేట్ ఇస్తానంటూ రీసెంట్ గా రీల్ చేసి, ఏదో పెద్ద ప్లానే చేస్తున్నాడు అనిపించేలా చేశాడు. తన టీంతో కలిసి మళ్ళీ డాన్స్ స్టూడియోలో డాన్స్ రిహర్సల్స్ కూడా ప్రాక్టీస్ చేశాడు. రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’లోని ‘డోప్’ సాంగ్ తో జానీ మాస్టర్ మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. శంకర్ పిక్చరైజేషన్ ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది శంకర్ కు తమన్ తోడైతే, పైగా జానీ మాస్టర్ కంపోజిషన్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అంటూ ఈ సాంగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.

ఇలా అందరూ జానీ మాస్టర్ (Jani Master) చేసిన ఈ పాట గురించి ఎదురు చూస్తుంటే, ఆయన మాత్రం మరో క్రేజీ ప్రాజెక్టు గురించి ఎదురు చూస్తున్నట్టుగా అన్పిస్తోంది. తాజాగా జానీ మాస్టర్ వైవిఎస్ చౌదరితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒకప్పుడు వైవిఎస్ చౌదరి నుంచి సినిమాలు వస్తున్నాయంటే తెలుగులో బాగా సందడిగా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో కొత్త కంటెంట్ తో ఆకట్టుకుంటున్న కొత్త దర్శకులు ఎందరో తెరపైకి రావడంతో, వైవిఎస్ చౌదరి వెనుకబడిపోయారు.


అయితే ఇప్పుడు ఆయన హరికృష్ణ మనవడు, జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావు (NTR) డెబ్యూ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనను జానీ మాస్టర్ తన భార్యతో పాటు వెళ్ళి కలవడం విశేషం. అయితే జానీ మాస్టర్ (Jani Master) తన పోస్ట్ లో వైవిఎస్ చౌదరితో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయడమే కాకుండా అసలు ఎందుకు కలిశాడో కూడా వివరించారు. “చాలా రోజుల తర్వాత జెమ్ లాంటి పర్సన్, డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారిని కలిసాను. నా కెరీర్ మొదట్లోలాగే ఆయన ఇచ్చిన సపోర్ట్, మాటలు నాకు మళ్ళీ అపారమైన శక్తిని ఇచ్చాయి. తెలుగులో డాన్స్ మాస్టర్లకు మంచి అవకాశాలు ఇచ్చి, ఎదగడానికి సహాయం చేసిన అతి కొద్ది మంది దర్శకులలో ఆయన కూడా ఒకరు. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ జానీ మాస్టర్ రాసుకొచ్చారు. దీంతో వైవిఎస్ చౌదరి కొత్త సినిమాలో కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి అవకాశం ఇచ్చారా? అనే డౌట్ మొదలైంది. కానీ జానీ మాస్టర్ మాత్రం వైవీఎస్ చౌదరిని ఏ సందర్భంలో కలిశారో మాత్రం చెప్పలేదు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×