Akhanda 2 Update:బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna)హీరోగా వచ్చిన చిత్రం ‘అఖండ’. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ గా రాబోతున్న ‘అఖండ-2’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ వరుస సినిమాలు హిట్ కొట్టడంతో అఖండ -2 మీద కూడా ప్రేక్షకులకి అంచనాలు పెరిగిపోయాయి. అయితే అలాంటి అఖండ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న అఖండ-2 మూవీలో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇంకా కొత్త నటీనటులను కూడా యాడ్ చేస్తూ సినిమాపై భారీ హైప్ పెంచుతున్నారట. అయితే తాజాగా సినీ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 లో నాగ సాధు పాత్రలో ఒకప్పటి సీనియర్ నటిని బోయపాటి శ్రీను దించుతున్నట్లు తెలుస్తోంది.మరి ఇంతకీ నాగసాధు పాత్రలో కనిపించబోతున్న ఆ సీనియర్ నటి ఎవరో ఇప్పుడు చూద్దాం..
కరోనా టైమ్ లో కూడా విడుదల చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య..
2021 కరోనా సమయంలో ఎంతోమంది హీరోలు షూటింగ్ మానేసి ఇంటి దగ్గర బిక్కుబిక్కుమంటూ కూర్చున్న టైంలో కూడా బాలకృష్ణ ధైర్యంగా ముందుకు వచ్చి తన సినిమా షూటింగ్ పూర్తి చేసి, చివరికి అంత కరోనాలో కూడా తన అఖండ మూవీని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.అయితే ఈ సినిమా చూడడానికి ఎవరూ రారు అని అప్పట్లో చాలా వార్తలు వినిపించాయి. ఎందుకంటే కరోనా టైం కాబట్టి బయటికి రావడానికి ప్రజలు భయపడ్డారు. కానీ అంత భయంలో కూడా బాలకృష్ణ అఖండ విడుదలై భారీ హిట్టు కొట్టింది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఇక బోయపాటి బాలకృష్ణ కాంబో ఎలా ఉంటుందో అఖండ మూవీతో మరోసారి నిరూపించారు. అలా అఖండ మూవీలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించారు. అలా ఎలాంటి అంచనాలు లేకుండా కరోనా టైంలో వచ్చిన అఖండ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ సినిమా సీక్వెల్ కూడా ప్రకటించారు.
అఖండ 2లో నాగసాధు పాత్రలో శోభన..
తాజాగా మహా కుంభమేళా జరుగుతున్న సమయంలోనే అఖండ-2 మూవీకి సంబంధించి షూట్ కూడా స్టార్ట్ చేశారు. మహా కుంభమేళా అంటే ఎన్ని కోట్ల మంది వస్తారో చెప్పనక్కర్లేదు. అయితే అంత మంది మధ్యలో మూవీ షూట్ చేస్తున్నారంటే అది డైరెక్టర్ ధైర్యం అనే చెప్పాలి. ఎందుకంటే అంత మంది మధ్యలో షూట్ చేయడం చాలా కష్టమైన పని.
కానీ మహా కుంభమేళ షూటింగ్ కి అనువైనది అని, అఖండ-2 మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అఖండ-2 లో మరో కొత్త హీరోయిన్ జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది.ఇక ఒకప్పటి నటి శోభన(Shobhana).. గత ఏడాది ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898AD లో మరియమ్ అనే కీలక పాత్ర పోషించిన శోభన.. ఈ సినిమాలో నాగసాధువుగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో నాగ సాధువులకు సంబంధించి పలు కీలకమైన సన్నివేశాలు కూడా షూట్ చేసినట్లు తెలుస్తోంది. అలా నాగ సాధువుగా పాత్ర నచ్చడంతో శోభన కూడా నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమాలో శోభన క్యారెక్టర్ కి నాలుగైదు రకాల వేరియేషన్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఒకప్పటి సీనియర్ నటి శోభనని ఈ సినిమాలో నాగ సాధువుగా తీసుకోవడంతో బోయపాటి ప్లాన్ మామూలుగా లేదుగా అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.