VK. Naresh – Pavitra lokesh..సీనియర్ నటుడు వీ.కే.నరేష్ (VK. Naresh) , పవిత్ర లోకేష్ (Pavitra lokesh) తో సహజీవనం చేసిన విషయం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎంతలా కుదిపేసిందో చెప్పనక్కర్లేదు.ఈ వార్త మీడియాలో ఎన్ని రకాలుగా వైరల్ అయిందో చెప్పనవసరం లేదు. ముఖ్యంగా గత రెండు సంవత్సరాల క్రితం.. నరేష్, పవిత్ర లోకేష్ లు ప్రతిరోజు వార్తల్లో హాట్ టాపిక్ గానే నిలిచేవారు.డిజిటల్ మీడియాలో, మెయిన్ మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నరేష్, పవిత్రాలకు సంబంధించిన వార్తలే కనిపించేవి, వినిపించేవి కూడా..అలా వీళ్లు తమ బంధంతో టాలీవుడ్ లో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయారు. అయితే అలాంటి నరేష్ తాజాగా పవిత్ర లోకేష్ వల్లే నా జీవితం ఇలా తయారయ్యింది అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. మరి ఇంతకీ నరేష్ మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి..? ఆయన ఏం మాట్లాడారు? అనేది ఇప్పుడు చూద్దాం..
టైటానిక్ షిప్ కూడా ఒడ్డుకు చేరుతుంది..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ మాట్లాడుతూ..” నా జీవితంలోకి పవిత్ర లోకేష్ వచ్చాక.. నా లైఫ్ పూర్తిగా మారిపోయింది. నా జీవితం అనే టైటానిక్ షిప్ ఒడ్డుకి చేరినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే పవిత్ర నా లైఫ్ లోకి వచ్చాక అంతా రిలీఫ్ అయింది. అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే ఎంత ఇబ్బందికరమైన జీవితమైనా సాఫీగా సాగించవచ్చు. అలా అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే టైటానిక్ షిప్ కూడా ఒడ్డుకు చేరుతుంది. అలాగే పవిత్ర వచ్చాక నా పరిస్థితి మొత్తం మారిపోయింది” అంటూ సీనియర్ నటుడు నరేష్ తన 52వ పుట్టినరోజు సందర్భంగా పవిత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పవిత్ర గురించి నరేష్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.
నరేష్ వైవాహిక బంధంలో అన్నీ కష్టాలే..
దివంగత సీనియర్ నటి విజయనిర్మల(Vijaya nirmala) కొడుకే నరేష్.. విజయనిర్మల కృష్ణ (Krishna) ని రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ, ఆయనతో పిల్లల్ని కనలేదు. అలా నరేష్ విజయనిర్మల యావదాస్తికి ఒక్కడే వారసుడు. ఎన్నో వేలకోట్ల ఆస్తులున్న నరేష్ సినీ లైఫ్ బాగున్నప్పటికీ పర్సనల్ లైఫ్ మాత్రం అంత బాగాలేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇద్దరితో విడాకులైనప్పటికీ మూడో భార్య రమ్య రఘుపతి (Ramya raghupathi ) మాత్రం చిత్రహింసలు పెట్టింది.రమ్య రఘుపతి తో విడాకులకు అప్లై కూడా చేశారు నరేష్.ఇక రమ్యతో నరేష్ కి గొడవలు అవుతున్న తరుణంలోనే సినిమాల్లో తల్లి, అత్త పాత్రల్లో నటించే పవిత్ర లోకేష్ ఆయనకి పరిచయమైంది. అలా వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్త సహజీవనానికి దారి తీసింది. అలా వీరిద్దరి రిలేషన్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు రమ్య రఘుపతి వీరికి సంబంధించిన ఎన్నో విషయాలు బయటపెట్టి, నాకు విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయితో ఎలా సహజీవనం చేస్తాడు అంటూ మీడియాలో రచ్చ రచ్చ చేసిన సంగతి మనకు తెలిసిందే.గత రెండు సంవత్సరాల క్రితం నరేష్,పవిత్ర లోకేష్,రమ్య రఘుపతి కి సంబంధించిన వార్తలే మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి.ఇక పవిత్ర లోకేష్ తో పాటు నరేష్ కి కూడా పెళ్లి అయ్యింది. ఇక వీరిద్దరికి సంబంధించి ‘మళ్లీ పెళ్లి’ అనే బయోపిక్ కూడా వచ్చింది.ఈ సినిమాలో వాళ్ల రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనలు చూపెట్టారు. ప్రస్తుతం నరేష్, పవిత్రలు పెళ్లి చేసుకోకపోయినప్పటికీ సహజీవనం చేస్తూ భార్యాభర్తల్లాగే ఉంటున్నారు.