Actress Sirisha News:బుల్లితెర నటి శిరీష గురించి తెలుగు బుల్లితెర అభిమానులకు అస్సలు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొగలిరేకులు సీరియల్ నుంచి మొన్నీమధ్య వచ్చిన చెల్లెలి కాపురం సీరియల్ వరకు ఆమె నటనకు ఫిదా కానీ వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అందం, అభినయంతో ఎలాంటి వారినైనా తన నటనతో పడేస్తూ ఎంతోమంది అభిమానులను పోగుచేసుకుంది. ప్రస్తుతం కెరీర్ లో కొంత గ్యాప్ వచ్చినా దైర్యంగా నిలబడి ముందుకు కొనసాగుతోంది.
ఇక ఈ మధ్యనే శిరీష అభిమానులకు పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పిన విషయం తెల్సిందే. తన భర్త నవీన్ తో విడిపోయినట్లు అధికారికంగా తెలిపింది. ఆరేళ్ళ క్రితం శిరీష- నవీన్ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య కలహాలు రేగడంతో.. ఆ విబేధాలను తట్టుకోలేక విడిపోవడమే బెటర్ అని విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్నీ శిరీష స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. దీంతో నెటిజన్స్ చాలామంది ఆమెకు సపోర్ట్ గా నిలబడగా.. మరికొంతమంది ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.
ఇక ఇవేమి పట్టించుకోని శిరీష.. వరుస షోస్, వెబ్ సిరీస్ లతో బిజీగా మారింది. తాజాగా ఆమె నటించిన ఒక వెబ్ సిరీస్ నెట్టింట వైరల్ గా మారింది. శిరీష అక్కలు ఇద్దరు కూడా నటీమణులే అన్న విషయం తెల్సిందే. పెద్దక్క రజిత, రెండో అక్క సౌజన్య. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి ఒక సిరీస్ లో నటించారు. అదే 3 డెవిల్స్. ఈ సిరీస్ కు గుప్పెడంత మనసు, బ్రహ్మముడి డైరెక్టర్ కుమార్ దర్శకత్వం వహించడం విశేషం. ఆయనే సొంతంగా నవరస క్రియేటివ్ వర్క్స్ అనే యూట్యూబ్ ను ఓపెన్ చేసి అందులో మంచి మంచి వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తున్నాడు.
అవుట్ అవుట్ కామెడీ సిరీస్ గా 3 డెవిల్స్ తెరకెక్కించారు. శిరీష కామెడీ హైలైట్ గా నిలిచింది. కేవలం ఐదు ఎపిసోడ్స్ మాత్రమే ఉన్న ఈ సిరీస్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన నాలుగు ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఫైనల్ ఎపిసోడ్ రానుందని డైరెక్టర్ తెలిపారు. ఇక విడాకులు తీసుకున్న తరువాత శిరీష చేస్తున్న మొదటి సిరీస్ కావడంతో ఆమె అభిమానులు ఈ సిరీస్ ను మరింత ట్రెండ్ చేస్తున్నారు.