BigTV English

Dhoni Coconut Leave Art: సీఎస్కే ఫ్యాన్స్ ఆ.. మజాకా.. కొబ్బరి ఆకులపై ధోనీ ఫోటో గీసేసారు..

Dhoni Coconut Leave Art: సీఎస్కే ఫ్యాన్స్ ఆ.. మజాకా.. కొబ్బరి ఆకులపై ధోనీ ఫోటో గీసేసారు..

Dhoni Coconut Leaves Art: సెలబ్రిటీలకే ఫ్యాన్ ఉంటారనేది చాలా మంది అపోహ. క్రికెటర్లకు కూడా డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అందులో ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని అంటే చచ్చేంత ఇష్టపడే ఫ్యాన్స్ ఉన్నారు. అందులోని ఐపీఎల్ వచ్చిందంటే చాలు.. దానికొక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఐపీఎల్ లో తమ అభిమాన టీం లేదా అభిమాన క్రికెటర్ ఫోర్లు, సిక్సులు కొట్టి మ్యాచ్ గెలుస్తారంటూ కోట్లలో బెట్టింగులు పెడతారు. మరికొందరు అయితే చేతులపై పచ్చబొట్లు కూడా పొడుచుకుంటారు. ఇలా ఎన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నా కూడా తరచూ ఏదో ఒక విధంగా క్రికెటర్ల ఫ్యాన్స్ తమ అభిమాన క్రికెటర్ పై ప్రేమాభిమానాలు చాటుకుంటున్నారు.


ఈ తరుణంలోనే తాజాగా స్టార్ క్రికెటర్ ఎంఎస్. ధోని (మహేందర్ సింగ్ ధోని) మరియు తన ఐపీఎల్ టీం సీఎస్కే అంటే అభిమానులు పడి చచ్చిపోతున్నారు. సీఎస్కే టీం గెలవాలని ప్రార్థిస్తున్నారు. ఈ తరుణంలోనే ధోనిపై ఓ తమిళనాడుకు చెందిన అభిమాని అభిమానాన్ని చాటుకున్నాడు. నేడు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. ఈ తరుణంలో సీఎస్కేను సపోర్ట్ చేస్తూ పుదుకొట్టై యువకులు చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నేతాజీ అనే ప్రైవేట్ కంపెనీలో పని చేసే యువకుడు ధోనిపై తన ప్రేమను చాటుకున్నాడు.

పుదుకోట్టై జిల్లా విరాలిమలైకు చెందిన నేతాజీ అనే వైద్య విద్యార్థి కొబ్బరి ఆకుపై ధోని చిత్రాన్ని గీసి తన అభిమానాన్ని ప్రపంచానికి చాటాడు. నేడు జరగబోయే మ్యాచ్ లో సీఎస్కే తప్పకుండా గెలవాలని ఆకాంక్షించాడు. ఒకవేళ ఈ ఐపీఎల్ లీగ్ లో ఓడిపోతే ధోని తర్వాత జరిగే లీగ్ లో ఆడతాడో లేదో తెలియదని, అందువల్ల తన కోసం ఈ కొబ్బరి ఆకుపై ధోని ఫోటోను గీసినట్లు యువకుడు తెలిపాడు. ఓ వైపు ధోని ఫోటోతో పాటు ధోని జెర్సీ ఫోటోను గీశాడు.


Tags

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×