Tips For Ironing Clothes: మనలో చాలా మంది బట్టలు ఐరన్ చేయకుండా వేసుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా ఆఫీసుల్లో పని చేసే వారు ఇంటి నుండి బయలు దేరే ముందు ఉతికిన బట్టలు ఇస్త్రీ చేస్తుంటారు. అయితే ఇలాంటి సమయంలోనే కొన్ని సార్లు సడన్ గా కరెంట్ పోతుంది. ఈ సమస్య చాలా కామన్. అయితే ఇలాంటి పరిస్థితిలో ఆఫీసుకు వెళ్లే సమయానికి ఇస్త్రీ చేసిన బట్టలు కావాలికదా.. కరెంట్ లేకుండా లేని సమయంలో కొన్ని రకాల చిట్కాలు పాటించడం వల్ల ఐరన్ లేకుండానే బట్టల యొక్క ముడతలు తొలగిపోతాయి. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హాట్ కెటిల్ :
హాట్ కెటిల్ వాడి బట్టల యొక్క ముడతలను తగ్గించవచ్చు. ఇందుకోసం మీ వద్ద ఉన్న కెటిల్ లో మరిగించిన నీరు పోసి దాంతో క్లాత్‌పై రుద్దండి. వీలైతే మీరు ఐరన్ చేసే క్లాత్ పై కాస్త నీరు చల్లి కెటిల్ తో రుద్దినా కూడా ముడతలు తొందరగా పోతాయి.
పరుపు క్రింద ఉంచండి:
ఏ సమయంలోనైనా కరెంట్ పోతే బట్టలను చక్కగా మడిచి పరుపు క్రింద ఉంచడం వల్ల ముడతలు కొంతవరకు తగ్గుతాయి. వీలైతే ముందు రోజు రాత్రంగా పరుపు క్రింద ఉంచినా కూడా బట్టలపై ఉన్న ముడతలు ఈజీగా తొలగిపోతాయి.
బట్టలు ఎక్కువగా ముడతలు పడటానికి కారణం ?
బట్టలపై ముడతలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. బట్టలు ఉతికి ఆరబెట్టే విధానం కూడా ఇందుకు ఒక కారణం. ఇదిలా ఉంటే వాషింగ్ మిషిన్‌లో బట్టలు ఉతకడం వల్ల బట్టలు కుంచించుకుపోతాయి. బట్టలు సరిగ్గా ఆరకపోయినా కూడా ముడతలు ఎక్కవగా కనిపిస్తాయి.
కొన్ని రకాల బట్టలకు ఎక్కువగా ముడతలు పడుతుంటాయి. సన్నని బట్టలు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ముడతలు పడే అవకాశాలు చాలా ఎక్కవ అనే చెప్పాలి. పట్టు, నైలాన్, పాలిస్టర్ బట్టలు తక్కువగా ముడతలు పడతాయి.
Also Read: మునగ కాయలు తింటే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు !
బట్టలు ముడతలు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు !
బట్టలు ఉతికేటప్పుడు కొన్ని రకాల పొరపాట్లు చేయడం వల్ల కూడా బట్టలు ఎక్కవగా ముడతలు పడతాయి. ముఖ్యంగా వాషింగ్ మిషన్‌లో ఒకే సారి ఎక్కవ బట్టలు వేయడం వల్ల, సరిపడా నీళ్లు లేకపోవడం వల్ల వాషింగ్ మిషన్ లో ఎక్కువ సేపు వాష్ చేయడం వల్ల కూడా బట్టలు ఎక్కువగా ముడతలు పడతాయి.